Tuesday, October 21, 2025 07:30 PM
Tuesday, October 21, 2025 07:30 PM
roots

అమెరికాకు దగ్గరయ్యేందుకు పాక్ కష్టాలు..!

భారత్ – అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అమెరికాకు దగ్గరయ్యేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. ముఖ్యంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ పదే పదే అమెరికా వెళ్తున్నారు. ఇక తాజాగా వచ్చిన పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం.. మరో వార్త ఆసక్తిని రేపుతోంది. సెప్టెంబర్ 25న న్యూయార్క్‌ లో జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తో సమావేశం కానున్నారు.

Also Read : మోడీకి ట్రంప్ ఫోన్.. తప్పు దిద్దుకుంటున్న పెద్దన్న..?

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ తో పాటు పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెషన్ సందర్భంగా ఈ సమావేశం జరుగుతుందని పాకిస్తాన్ మీడియా తెలిపింది. ట్రంప్ తో వైట్ హౌస్ లో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆసిఫ్ మునీర్ కు ఇది మూడవ అమెరికా పర్యటన కావడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మునీర్‌ కు వైట్ హౌస్‌లో ఆతిథ్యం ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

Also Read : సాయుధ పోరాటానికి స్వస్తి పలుకుతున్నారా…?

ఆసిఫ్ మునీర్.. అమెరికా, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్‌ తో చర్చలు జరిపారు. పాకిస్తాన్, అమెరికా మధ్య గత కొన్నేళ్ళుగా సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అయితే ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో.. పరిస్థితి మారింది. పాకిస్తాన్ లో ఆయిల్ నిల్వలకు సంబంధించి అమెరికా కీలక అడుగు వేసింది. ఇక అక్కడి నుంచి ఆసిఫ్ మునీర్ పదే పదే అమెరికా వెళ్ళారు. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం సమయంలో కూడా పాకిస్తాన్ ఎయిర్ బేస్ ను అమెరికా వాడుకుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్