Friday, September 12, 2025 09:35 PM
Friday, September 12, 2025 09:35 PM
roots

ఆదుకోండి ప్లీజ్.. అంతర్జాతీయ సమాజానికి పాక్ విజ్ఞప్తి

భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం తారస్థాయికి చేరుకుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో రెండు దేశాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మీ ప్రతీకార దాడులకు దిగింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ భూభాగం పై నేరుగా భారత వైమానిక దళం దాడి చేసింది. ఆ తర్వాత పరిస్థితులు వేగంగా మారుతూ వస్తున్నాయి. ఇక పాకిస్తాన్ కూడా భారత నగరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది.

Also Read : మన సైన్యం బలమెంత.. యుద్ధం వస్తే పాక్ పరిస్థితి ఏంటీ..?

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్ అలాగే క్షిపణులను భారత్ సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఉగ్రవాదం పై పోరు కోసం అమెరికా ఇచ్చిన విమానాలను కూడా పాకిస్తాన్.. భారత్ పై యుద్ధానికి వాడుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇదిలా ఉంచితే పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారుతుంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే పతనావస్థలో ఉండగా భారత్ చేస్తున్న దాడులతో మరింత దారుణంగా మారింది. ఒకవేళ యుద్ధం వస్తే అడ్డుకునేందుకు పాకిస్థాన్ వద్ద సమర్థవంతమైన వనరులు కూడా లేవు.

Also Read : అందరి పేర్లు రాసిపెట్టుకోండి..జగన్ 2.0లో తేలుస్తా..!

తాజాగా దేశ స్టాక్ మార్కెట్లు కూడా పతనం కావడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడింది. భారత్ ఇదే విధంగా దాడులు కొనసాగిస్తే మాత్రం పాకిస్తాన్ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయే అవకాశాలు ఉన్నాయి. దీనితో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తమ దేశానికి సాయం చేయాలంటూ అంతర్జాతీయ సమాజాన్ని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. తమ దేశానికి ఆర్థిక సహాయం చేయాలని రుణాలు ఇవ్వాలి అని కోరుతోంది. భారత్ చేసిన దాడులతో.. తన దేశ స్టాక్ మార్కెట్ కూడా కుప్పకూలిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. అటు పాకిస్తాన్ ప్రజలు కూడా సోషల్ మీడియాలో తమను అంతర్జాతీయ సమాజం ఆదుకోవాలని పోస్టులు పెడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్