భారత్ విషయంలో పాకిస్తాన్ మీడియా, అక్కడి ప్రజల కంటే, అక్కడి మీడియా ఎక్కువ ఓవరాక్షన్ చేస్తున్న సంగతి తెలిసిందే. పదే పదే భారత్ ను రెచ్చగొట్టే విధంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కీలక ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన చేసిన ప్రకటన మరోసారి వివాదాస్పదంగా మారింది. ఏకంగా గుజరాత్ లోని రియలయన్స్ ఆయిల్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆయన బెదిరించడం గమనార్హం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, భవిష్యత్తు పరిణామాలపై కీలక ప్రకటన చేసారు.
Also Read : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మార్గదర్శకాల పై మీరు సంతృప్తిగా ఉన్నారా?
భవిష్యత్తులో ఏదైనా సైనిక ఘర్షణ జరిగితే గుజరాత్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు చెందిన జామ్‌నగర్ ఆయిల్ ప్యూరిఫై ఇండస్ట్రీని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు అని జాతీయ మీడియా వెల్లడించింది. భారత్ కు చెందిన పలు కీలకమైన చమురు మౌలిక సదుపాయాలపై దాడి చేయాలనే ఉద్దేశ్యాన్ని ఆ దేశం స్పష్టంగా బయటపెట్టింది. గతంలో ఎప్పుడూ ఆ దేశ ఆర్మీ ఈ విధంగా ప్రకటనలు చేయలేదు. పాకిస్తాన్ ప్రవాసులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, మునీర్ అణు బెదిరింపులు కూడా చేయడం గమనార్హం.
Also Read : యుద్ధం ఆపుతా.. ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్
ఆమెరికా పర్యటనలో ఉన్న మునీర్.. ఆ దేశ ప్రభుత్వంతో ఎక్కువ సన్నిహితంగా ఉంటున్నారు. పదే పదే భారత్ ను బెదిరించే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఇదే ప్రయత్నాలు ఈ మధ్య కాలంలో చేస్తూ రావడం, పాకిస్తాన్ మద్దతు కోరడం గమనార్హం. ఇప్పటికే భారత్ పై 50 శాతం సుంకాలు విధించింది అమెరికా. ఇక పాకిస్తాన్ ప్రకటనపై స్పందించిన భారత విదేశాంగ శాఖ ఇటువంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తాము లొంగేది లేదని స్పష్టం చేసింది.