భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనగానే క్రికెట్ అభిమానుల్లో ఉండే క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. దాయాదుల మధ్య పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే పాకిస్తాన్ క్రికెట్ చేష్టలతో ఇక భారత్, పాకిస్తాన్ క్రికెట్ ఆడే సంకేతాలు కనపడటం లేదు. అంతర్జాతీయంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం తన వైఖరి మార్చుకోవడం లేదు. ఆ దేశ క్రికెట్ బోర్డు ఆర్థికంగా నష్టపోతున్నప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు మాత్రం భారత్ విషయంలో కక్ష సాధింపుగానే వ్యవహరిస్తూ.. తమ దేశ క్రికెట్ బోర్డును నష్టాల్లో ముంచేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.
Also Read : అందరి బ్రతుకు నాకు తెలుసు.. సమావేశంలో రెచ్చిపోయిన పవన్
భారత్ తో జరిగే మ్యాచ్లను బహిష్కరించాలని నిర్ణయించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. దీనివల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారీగా నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి. గత ఏడాది నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీ కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు పెద్దగా ఆదాయం రాలేదు. వారి దేశంలోనే జరిగిన సరే భారత్ అక్కడ పర్యటించకపోవడంతో.. మైదానాలను ఆధునికరించిన ఖర్చులు కూడా పాకిస్తాన్ కు రాలేదు. దీని కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నష్టాలతోనే ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించిన పరిస్థితి. ఇక భారత్ తో జరిగే మ్యాచ్లను ఇప్పుడు బహిష్కరిస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి వచ్చే ఆదాయం కూడా భారీగానే కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయి. దీనివల్ల భారత్ పెద్దగా నష్టపోయే సంకేతాలు ఏమీ లేవు.
Also Read : బరితెగింపు వెనుక జగన్ ఆశీస్సులు..!
ఇక ఐసీసీ భవిష్యత్తులో పాకిస్తాన్ విషయంలో కఠినంగానే వ్యవహరించే సంకేతాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. మెగా టోర్నీల విషయంలో పాకిస్థాన్ ను ఐసీసీ నమ్మే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఐసీసీ శ్రీలంకకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఆడే మ్యాచ్ లు అన్ని శ్రీలంకలోనే నిర్వహిస్తారు. దీనితో శ్రీలంక భారీ ఏర్పాట్లు చేసింది. ఇక భారత్ తో జరిగే మ్యాచ్ కోసం.. కూడా పటిష్ట చర్యలు చేపట్టింది. ఇప్పుడు పాకిస్తాన్ దూరం కావడంతో శ్రీలంక క్రికెట్ బోర్డు కు వచ్చే ఆదాయం కూడా కోల్పోయే సంకేతాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ శ్రీలంక కు కూడా నష్టపరిహారం కట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఐసీసీకి కూడా కొంత నష్టం ఉన్న నేపథ్యంలో కట్టే అవకాశాలే కనపడుతున్నాయి.

