Friday, September 12, 2025 03:33 PM
Friday, September 12, 2025 03:33 PM
roots

గిల్ పై విషం కక్కుతున్న పాక్, బంగ్లా క్రికెట్ ఫ్యాన్స్

పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల క్రికెట్ అభిమానులు భారత్ విషయంలో ఏ స్థాయిలో తమ ఘోష వినిపిస్తూ ఉంటారో మనం చూస్తూనే ఉంటాం. బంగ్లాదేశ్ గెలిచిన మ్యాచ్ ల కంటే సోషల్ మీడియాలో భారత్ ను తిట్టడానికి క్రియేట్ చేసిన ఖాతాలే ఎక్కువ అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్, భారత్ విషయంలో ఇదే అక్కసు ప్రదర్శిస్తూ ఉంటాయి ఈ రెండు దేశాలు. ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలో భారత టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్ భారీ డబుల్ సెంచరీ చేసాడు. ఇంగ్లాండ్ బౌలింగ్ ఎదుర్కొని గిల్ సత్తా చాటాడు.

Also Read : ఈసారికి నన్ను వదిలేయండి.. ప్లీజ్..!

ఈ సందర్భంగా గిల్ పలు రికార్డులను బ్రేక్ చేసాడు. డబుల్ సెంచరీ చేసిన యువ కెప్టెన్ గా రికార్డు క్రియేట్ చేసాడు. ఇక ఇంగ్లాండ్ లో డబుల్ సెంచరీ చేసిన మూడవ భారత ఆటగాడు గిల్. అంతకు ముందు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్ మాత్రమే చేసారు. గిల్ చేసిన 269 పరుగులు ఆసియా వెలుపల టెస్టుల్లో ఒక భారత బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక పరుగులు. ఇంగ్లాండ్ లో అత్యధిక పరుగులు ఒక ఇన్నింగ్స్ లో చేసిన ఆటగాడిగా కూడా గిల్ రికార్డులు క్రియేట్ చేసాడు.

గతంలో గ్రేమ్ స్మిత్ 2003లో 277 పరుగులు చేయగా, జహీర్ అబ్బాస్ 1971లో 274 పరుగులు చేశారు. గిల్ చేసిన 269 పరుగులు ఇంగ్లాండ్‌లో టెస్ట్ మ్యాచ్‌లలో ఒక విదేశీ బ్యాట్స్‌మన్ సాధించిన ఎనిమిదో అత్యధిక స్కోరు .ఇక అక్కడి నుంచి పోలికలు మొదలుపెట్టింది. మొన్నటి వరకు బాబర్ ఆజం ను విరాట్ కోహ్లీతో పోల్చి త్రుప్తి పడిన ఈ రెండు దేశాల అభిమానులు.. ఇప్పుడు గిల్ తో పోల్చడం మొదలుపెట్టారు. ఆస్ట్రేలియాలో గిల్ ఫెయిల్ అయ్యాడని, వీక్ బౌలింగ్ లైనప్ పై అతను ఎన్ని సెంచరీలు చేసినా పెద్ద గొప్ప కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : తిరుపతిలో భయపెడుతున్న గంజాయి గ్యాంగ్ లు..

ఇక గిల్ చేసిన డబుల్ సెంచరీ కంటే ఆస్ట్రేలియాలో కమ్మిన్స్, హేజిల్వుడ్, స్టార్క్ వంటి బౌలింగ్ లైనప్ ను ఎదుర్కొని బాబర్ చేసిన 196 పరుగులు గొప్పవి అంటూ ట్రోల్ చేస్తున్నారు. పిచ్ కఠినంగా ఉన్న సమయంలో అతను చేసాడని.. గిల్ డబుల్ సెంచరీ చేసిన పిచ్ రోడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దూకుడుపై కూడా సెటైర్ లు వేస్తున్నారు. గిల్ కెప్టెన్ కు అర్హుడు కాదని.. ఫోటో మార్ఫింగ్ లు చేస్తూ సందడి చేస్తున్నారు. మొదటి మ్యాచ్ లో భారత్ ఓడిపోవడానికి గిల్ కారణం అని, అతనిలో కెప్టెన్ గా కొనసాగే స్కిల్స్ లేవు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్