Saturday, October 18, 2025 07:38 PM
Saturday, October 18, 2025 07:38 PM
roots

ప్రాణాలు కోల్పోయిన యువ క్రికెటర్లు..!

పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో భారీగా వైమానిక దాడులకు తెగబడింది. పాకిస్తాన్ – ఆఫ్ఘానిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే దానిని పాక్ సైన్యం ఉల్లంఘించింది. వైమానిక దాడుల కారణంగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. డ్యూరాండ్ లైన్ వెంబడి పక్టికా ప్రావిన్స్‌లో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాకిస్తాన్‌తో జరగనున్న క్రికెట్ మ్యాచ్‌ల నుంచి వైదొలగనున్నట్లు ఆఫ్ఙన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.

Also Read : ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.. ఆస్ట్రేలియాకు లోకేష్ పయనం

పాక్ వైమానిక దాడుల్లో పలు నివాసాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆఫ్ఘన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. ఇటీవల ఆఫ్ఘన్ దళాలు పాకిస్తాన్ ఆర్మీ పోస్టులపై దాడి చేయడంతో రెండు దేశాల మధ్య దాడులు మొదలయ్యాయి. ఇప్పటికే ఇరు వైపుల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది. పాక్ జరిపిన వైమానిక దాడుల్లో క్రికెటర్లు సిబతుల్లా, హరూన్, కబీర్ చనిపోయినట్లు ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 17వ తేదీ నుంచి పాకిస్తాన్ – శ్రీలంక – ఆఫ్ఘానిస్థాన్ మధ్య జరగనున్న ముక్కోణపు సిరీస్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.

Also Read : బ్రేకింగ్: ఛీఫ్ సెలెక్టర్ గా రవిశాస్త్రి

ఆఫ్ఘానిస్థాన్‌పై పాకిస్తాన్ వైమానికి దాడులు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడి దురదృష్టకరమైన ఘటనగా భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆఫ్ఘాన్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించింది. ముగ్గురు క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడంపై ఆఫ్ఘాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ రషీద్ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. ముక్కోణపు సిరీస్‌ నుంచి వైదొలగాడాన్ని రఫీద్ సమర్థించారు. సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడులకు తెగబడుతోందని.. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని ఆఫ్ఘాన్ రక్షణ శాఖ వెల్లడించింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

ఎన్నాళ్ళీ వర్క్ ఫ్రమ్...

రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు ఎంత బలంగా...

పోల్స్