జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి విషయంలో ఇప్పటికీ పాకిస్తాన్ డ్రామాలు ఆడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై భారత్ దాడులకు దిగినా పాకిస్తాన్ వైఖరి మాత్రం మారలేదు. ఇక ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న ఆ దేశ రాజకీయ నాయకులు.. వారితో కలిసి బహిరంగ సభల్లో సైతం పాల్గొనడం ఆశ్చర్యం కలిగించే అంశంగా చెప్పాలి. తాజాగా ఇదే విషయం మరోసారి రుజువు అయింది. పహల్గాం ఉగ్రదాడిలో కీలకంగా భావిస్తున్న ఓ ఉద్యోగి.. ఆ దేశంలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేసాడు.
Also Read : 18 ఏళ్ళలో తొలిసారి.. బీఎస్ఎన్ఎల్ సరికొత్త రికార్డు
పహల్గామ్ ఉగ్రవాద దాడి వెనుక ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న.. లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) కమాండర్ సైఫుల్లా కసూరి బుధవారం బహిరంగంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ దేశ రాజకీయ నాయకులు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులతో కలిసి ఓ ర్యాలీలో పాల్గొన్నాడు. పాకిస్తాన్ తన అణు పరీక్షల వార్షిక స్మారకోత్సవమైన యూమ్-ఎ-తక్బీర్‌ను పురస్కరించుకుని.. పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ నిర్వహించిన ఈ ర్యాలీలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసాడు. అలాగే భారత వ్యతిరేక నినాదాలు సైతం చేసాడు.
Also Read : మద్దతు ప్లీజ్.. హస్తినకు జగననన్న
ఈ ర్యాలీలో హాజరైన వారిలో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు, ఉగ్రవాది తల్హా సయీద్ కూడా ఉన్నాడు. పంజాబ్ ప్రావిన్స్‌లోని కసూర్‌లో జరిగిన ర్యాలీలో కసూరి మాట్లాడుతూ, “పహల్గామ్ ఉగ్రవాద దాడికి నన్ను సూత్రధారిగా ప్రకటించారని.. ఇప్పుడు నా పేరు ప్రపంచం మొత్తం ఫేమస్ అయింది అన్నాడు. అంతర్జాతీయంగా, పాకిస్తాన్‌లో ఎల్‌ఇటి నిషేధంలో ఉన్నప్పటికీ, పిఎంఎంఎల్ వంటి గ్రూపులు దాని నాయకత్వంలో రాజకీయ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం ఆశ్చర్యం కలిగిస్తోంది.