ఉద్రిక్త కాశ్మీర్ లో మరో ఉగ్రదాడి కలకలం రేపింది. పర్యాటకులను తొలిసారి లక్ష్యంగా చేసుకున్న ముష్కరులు.. పాల్పడిన ఈ దాడితో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. ఆర్టికల్ 360 రద్దు అనంతరం చోటు చేసుకున్న భారీ దాడుల్లో ఇది ఒకటి. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలోని బైసారన్‌లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో 26 మంది మరణించారు. ఈ దాడిలో ఒక భారత నావికాదళ అధికారి, ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో సిబ్బంది కూడా మరణించారు.
Also Read : వీరయ్య చౌదరి మరణం వెనుక అతడే..?
మినీ స్విట్జర్లాండ్ గా పిలిచే ఈ ప్రాంతంలో అందమైన దృశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. పహల్గామ్ నుండి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వేసవిలో ఇక్కడికి విదేశాల నుంచి సైతం పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. పోనీ రైడ్‌లు, పిక్నిక్‌లు లేదా రోడ్డు పక్కన ఉన్న తినుబండారాలలో విశ్రాంతి తీసుకుంటున్న పర్యాటకులు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అక్కడ ఉన్న స్థానికులు సహా పలువురు పర్యాటకులు.. ఉగ్రవాదులు నిరంతరం కాల్పులు జరిపినట్టు వెల్లడించారు.
Also Read : కసిరెడ్డి కేసు: ఏసీబీ కోర్ట్ లో యుద్ద వాతావరణం
ప్రాణాలతో బయటపడిన వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. దాడి చేసిన వ్యక్తులు కాల్పులు జరిపే ముందు పర్యాటకులను పేర్లు అడిగి దాడి చేసారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) నుండి ఆవిర్భవించిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌ఎఫ్) ఈ దాడికి బాధ్యత వహించింది. వాస్తవానికి పర్యాటకులను ఉగ్రవాదులు చంపే ప్రయత్నం చేయరు. వారు అక్కడి స్థానికులకు ప్రధాన ఆదాయ మార్గం. ఉగ్రవాదులకు సహకరించే స్థానికులు.. అక్కడ వ్యాపారాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.
Also Read : నాకే పాపం తెలియదు.. పీఎస్ఆర్ ఆవేదన
అలాంటిది ఉగ్రవాదులు పర్యాటకులను చంపడం ఆశ్చర్యం కలిగించింది. స్థానికుల ఆదాయ మార్గాలపై దెబ్బ పడితే.. ఉగ్రవాదులకు కాశ్మీర్ లో సహాకారం తగ్గుతుంది. కానీ.. పర్యాటకులను టార్గెట్ చేయడం వెనుక కారణాలు ఏంటీ అనేది స్పష్టత రావడం లేదు. ఇక అమరనాథ్ యాత్రకు వెళ్లేందుకు పహల్గాం కీలకం. సోనామార్గ్-బల్తాల్ వైపు వెళ్ళే మార్గాలు ఉన్నా సరే ట్రెక్కింగ్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. అందుకే పహల్గాం వైపు నుంచి వెళ్తూ ఉంటారు. అయితే అమరనాథ్ యాత్రను దెబ్బ కొట్టడానికి ఈ దాడి జరిగిందా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.