Tuesday, October 28, 2025 04:21 AM
Tuesday, October 28, 2025 04:21 AM
roots

ఓన్లీ క్యాష్.. నో యూపీఐ ప్లీజ్.. వ్యాపారులకు షాక్..!

డిజిటల్ పేమెంట్స్ వినియోగదారులతో పాటు వ్యాపారుల పని కూడా చాలా ఈజీ అయ్యింది. ముఖ్యంగా చిల్లర సమస్యకు చెక్ పడిందనే చెప్పాలి. చిల్లర తిరిగి ఇచ్చేందుకు ఒకప్పుడు వ్యాపారులు ముప్పతిప్పలు పడేవాళ్లు. కానీ డిజిటల్ పేమెంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చివరికి ఒక బడ్డీ కొట్టు దగ్గర టీ తాగినా సరే.. ఒక చాక్లెట్ తీసుకున్నా సరే.. సింపుల్‌గా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం అంటూ స్కాన్ చేస్తున్నారు. దీంతో అకౌంట్ నుంచి అకౌంట్‌కు డబ్బులు ఇలా వెళ్లిపోతున్నాయి. చేతుల్లో చిల్లిగవ్వ లేకపోయినా సరే.. ఫోన్ ఉంటే చాలు.. ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు.. ఏమైనా చేయొచ్చు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి.. సందు చివర చిల్లర కొట్టు వరకు ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్స్ వాడుతున్నారు. అయితే కర్ణాటకలో మాత్రం.. మాకొద్దు ఈ డిజిటల్ పేమెంట్ అంటున్నారు వ్యాపారాలు.

Also Read : ఏపీలో కొత్త జిల్లా.. అమరావతిపై చంద్రబాబు సంచలన నిర్ణయం

నగదు చలామణిని తగ్గించి.. డిజిటల్ చెల్లింపులను విస్తృతం చేయాలనేది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మాట. ఇందుకు అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. డిజిటల్ చెల్లింపుల వల్ల పారదర్శకత ఉంటుందనే మాట కూడా వినిపిస్తోంది. అందుకే ఎక్కడికి వెళ్లినా సరే.. యూపీఐ చెల్లింపులు కనిపిస్తున్నాయి. కూరగాయల దుకాణం మొదలు.. కార్పొరేట్ షాపింగ్ మాల్ వరకు.. టీ బంక్ దగ్గర నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకు ఎక్కడైనా సరే.. అంతా డిజిటల్ పేమెంట్స్ కనిపిస్తున్నాయి. సరదాగా చేతిలో మొబైల్ ఫోన్ తీసుకుని షాపింగ్‌కు వెళ్లి.. కావాల్సిన వస్తువులు తీసుకుని యూపీఐ పేమెంట్ చేసేసి.. ఇంటికి వస్తున్నారు. కానీ కర్ణాటకలో మాత్రం.. నో యూపీఐ అంటున్నారు చిరు వ్యాపారస్తులు.

Also Read : హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్: పవన్ కల్యాణ్ భావోద్వేగ ప్రసంగం

డిజిటల్ పేమెంట్స్‌ నమ్ముకున్న కర్ణాటక చిరు వ్యాపారులు నో యూపీఐ ప్లీజ్ అనేస్తున్నారు. చిన్న కూరగాయల వ్యాపారం చేస్తున్న శంకర్ గౌడ్ అనే వ్యక్తికి అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. తన దగ్గరకి వచ్చే కస్టమర్ల కోసం యూపీఐ పేమెంట్ సదుపాయాన్ని అందుబాటులో ఉంచారు. శంకర్ గౌడ్ నాలుగేళ్ల పాటు నిర్వహించిన డిజిటల్ లావాదేవీలను పరిశీలించిన అధికారులు… జీఎస్టీ కట్టాలని నోటీసు ఇచ్చారు. ఇది చూసి శంకర్ గౌడ్ అవాక్కయ్యాడు. నాలుగేళ్ల కాలంలో ఏకంగా కోటీ 63 లక్షల లావాదేవీలు జరిగాయని.. కాబట్టి 29 లక్షలు జీఎస్టీ కింద చెల్లించాలని నోటీసు ఇచ్చారు. తనది చిన్న దుకాణమని.. అంత డబ్బు కట్టమంటే ఎలా అని శంకర్ గౌడ్ బదులిస్తున్నాడు.

Also Read : ఏపీలో మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఫిక్స్..!

అధికారుల నోటీసుతో ఒక్కసారిగా భయపడిన శంకర్ గౌడ్ తన దుకాణంలో ఇకపై కేవలం నగదు చెల్లింపులు మాత్రమే ఉంటాయని.. డిజిటల్ లావాదేవీలు లేవని నోటీసు పెట్టారు. దుకాణం ముందున్న క్యూ ఆర్ కోడ్‌ను చించేశారు. ఈ విషయంలో సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. కర్ణాటకలో పెద్ద దుమారం రేపింది. చిరు వ్యాపారులంతా తాము చేస్తున్న వ్యాపారాల్లో డిజిటల్ చెల్లింపులకు నో చెబుతున్నారు. క్యూ ఆర్ కోడ్ తొలగించేశారు. డిజిటల్స్ మాకొద్దు బాబోయ్ అంటూ వ్యాపారులు దండం పెడుతున్నారు. వ్యాపారులకు నోటీసులు ఇచ్చిన అధికారులు.. లావాదేవీలు జరిపినందుకు సాధారణ మధ్య తరగతి ప్రజలకు కూడా నోటీసులు ఇస్తారేమో అని సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. మళ్లీ నగదు చెల్లింపుల కారణంగా.. ప్రభుత్వానికి రావాల్సిన పన్ను చెల్లింపులకు బ్రేక్ పడుతుందని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. కర్ణాటక వెళ్తున్న వాళ్లు.. పర్సు నిండా డబ్బులు ఉంచుకునే వెళ్లాలంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్