Saturday, October 25, 2025 07:18 AM
Saturday, October 25, 2025 07:18 AM
roots

ఎలా బతికానో చెప్పిన రమేష్.. సీటు బెల్ట్ ప్రాణాలు కాపాడిందా..?

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రయాణికులలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అతనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అత్యవసర ద్వారం నుంచి అతను బయటపడి ఉండవచ్చు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. 11 ఏ సీటులో కూర్చున్న అతని పక్కనే ఎమర్జెన్సీ గేటు ఉందని, అక్కడి నుంచి అతను బయటపడ్డాడని మీడియాలో కూడా ప్రచారం గట్టిగా జరుగుతోంది. దీనిపై బయటపడిన రమేష్ అసలు విషయాలను వెల్లడించాడు.

Also Read : వరుస వివాదాల్లో రాము.. ఇప్పుడు అవసరమా..?

విమానం ఎడమ వైపున ఉన్న అత్యవసర డోర్ పక్కన అతను కూర్చున్న మాట వాస్తవమేనట. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విడిపోయిందని, తన సీటు శిథిలాల నుండి దూరంగా యెగిరి పడింది అని వివరించాడు. దీనితో తాను ఆ మంటల్లో చిక్కుకోలేదు అని తెలిపాడు. బ్రిటీష్ పౌరుడు అయిన రమేష్ ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాను విమానం నుంచి దూకలేదని, తాను ఆ సమయంలో సీటు బెల్ట్ పెట్టుకున్నాను అని.. ఆ సీటు మొత్తం విమానం నుంచి ఊడిపోయిందని వివరించాడు.

Also Read : విమాన ప్రమాదానికి కారణం అదేనా..?

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో, గాయాలతో, రక్తంతో తడిసిపోయిన రమేష్ అంబులెన్స్ వైపు కుంటుతూ వస్తున్నట్లు కనపడుతోంది. గురువారం నాడు 230 మంది ప్రయాణికులు మరియు 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఒక మెడికల్ కాలేజీ హాస్టల్‌పైకి దూసుకెళ్ళి కూలిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరుగుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

తెలుగు రాష్ట్రాలకు ముంచుకొస్తున్న...

భారత వాతావరణ శాఖ (IMD) తాజా...

దారితప్పిన వారిపై వేటు...

https://www.youtube.com/watch?v=O6ejiO-k3W8

ఆ ఇద్దరినీ వదలను.....

పదే పదే విమర్శలు.. ఒకరిపై ఒకరు...

కొలికపూడి శ్రీనివాస్ సస్పెన్షన్...

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు...

కంపెనీ ట్రిప్ కోసం...

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు...

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

పోల్స్