Monday, October 27, 2025 10:09 PM
Monday, October 27, 2025 10:09 PM
roots

వివేకా కేసులో కీలక అడుగు.. ఇప్పుడైనా అరెస్ట్ అవుతారా…?

2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు జరిగిన మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఇప్పటివరకు నిందితులు ఎవరు అనేది స్పష్టత రాలేదు. ఈ విషయంలో జాతీయ దర్యాప్త సంస్థ, సీబీఐ జోక్యం చేసుకున్న సరే… ఈ కేసు ముందుకు అడుగులు పడటం లేదు. ఇక ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి పై బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారనే ఆరోపణలు సైతం వినపడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Also Read : పార్టీ నేతలకే నమ్మకం పోయింది..!

ఈ కేసులో నిందితుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి పై కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే కొందరు అధికారుల పైన కేసు నమోదయింది. వివేకా కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. కడప సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు… జైల్లో చైతన్య తమను కలిసి మభ్యపెట్టినట్లు గతంలో ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు చేశాడు. వివేకా కేసులో కేవలం బాధితుల ఒత్తిడి వల్ల అప్రూవర్ గా మారి అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందని చెప్పమని.. చైతన్య ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Also Read : తెలంగాణాపై ఫోకస్.. లోకేష్ ఢిల్లీలో ఇంట్రస్టింగ్ సీన్..!

అలా చేస్తే 20 కోట్లు ఇస్తామని చైతన్య మభ్య పెట్టినట్టు పోలీసులకు చేసిన ఫిర్యాదులో అతను పేర్కొన్నాడు. అలాగే చైతన్య రెడ్డి తో పాటు అప్పట్లో కేసు నమోదు చేయకుండా, నిందితులకు సపోర్ట్ చేయమని తనపై ఒత్తిడి తెచ్చిన పోలీసు అధికారులపై కూడా దస్తగిరి ఫిర్యాదులు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు డిఎస్పి నాగరాజు, సీఐ ఈశ్వరయ్య, సెంట్రల్ సూపరింటెండెంట్ ప్రకాష్ లపై పులివెందుల పోలీసులు ఇప్పుడు కేసులు నమోదు చేశారు. ఇక 2023 నవంబర్ లో దస్తగిరి రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో చైతన్య రెడ్డి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి తనను బెదిరించినట్లు పలుమార్లు మీడియా ముందు దస్తగిరి ఆవేదన వ్యక్తం చేసాడు. ఈ విషయంలో సిబిఐ అలాగే జిల్లా ఎస్పీలకు కూడా ఇప్పటికే ఫిర్యాదులు చేసినట్లు తెలిపాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్