Wednesday, April 15, 2026 01:10 PM
Wednesday, April 15, 2026 01:10 PM

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ క్రేజీ అప్‌డేట్..!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గురించి ఏ వార్త వచ్చినా సోషల్ మీడియా షేక్ అవుతోంది. తాజాగా ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. దేవర భారీ విజయం, వార్ 2 ఫ్లాప్ తర్వాత.. తారక్ నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. సినిమాలో ఎన్టీఆర్ లుక్స్ పై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. గతంలో లేని విధంగా ఎన్టీఆర్ ఇప్పుడు కనపడుతున్నాడు. ఇదే సినిమా హైప్ ను ఓ రేంజ్ కు తీసుకువెళ్ళింది.

Also Read : అమరావతి వేదికగా సాకారమవుతున్న భారత క్వాంటం విప్లవం

మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో, ఆ రోజున అభిమానులకు మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా అధికారిక టైటిల్‌ను ప్రకటిస్తూనే, ఎన్టీఆర్ పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్‌ను కూడా అదే రోజు విడుదల చేయబోతున్నారట. ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్‌లో డ్రాగన్ అనే టైటిల్ బలంగా వినిపిస్తోంది, కానీ అధికారికంగా ఆ రోజే స్పష్టత రానుంది. ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్‌ ను ఢీకొట్టే పవర్‌ ఫుల్ విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్‌ తో చర్చలు జరుపుతున్నారట. పాన్ ఇండియా అప్పీల్ కోసం బాలీవుడ్ స్టార్‌ ను తీసుకురావాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు.

Also Read : బ్రేకింగ్: కేసీఆర్ కు షాక్ ఇచ్చిన సీతక్క..!

షాహిద్ కూడా ఈ పాత్ర పట్ల ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఇది గనుక నిజమైతే, బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైనట్లే. విలన్ పాత్ర కోసం తొలుత టోవినో థామస్‌ ను అనుకున్నా, ఆయన డేట్స్ కుదరక తప్పుకోవడంతో ఇప్పుడు బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ తో చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి తారక్ బర్త్ డే అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టేశారు. ప్రశాంత్ నీల్ ఎలివేషన్లకు తారక్ నటన తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అంటున్నారు అనలిస్ట్ లు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమలలో ఆ దర్శనం...

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర...

నా భార్యకు భద్రత...

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

వాళ్లిద్దరు కలిశారు సరే.....

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు...

వైసీపీ రాజకీయ పార్టీనా.....

వైసీపీ నేతల వరుస ప్రకటనలు ఇప్పుడు...

బ్రేకింగ్: కేసీఆర్ కు...

తెలంగాణ పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ...

టీడీపీ నేతలపై అధిష్టానం...

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన...

పోల్స్