భారత సంతతికి నరేష్ భట్ అమెరికాలో దారుణానికి పాల్పడ్డాడు. 33 ఏళ్ళ నరేష్ భట్ తన భార్యతో కలిసి వర్జీనియాలో నివాసం ఉంటున్నాడు. నరేష్ భట్ (33) తన భార్య నేపాల్‌కు చెందిన 28 ఏళ్ల మమతా కాఫ్లే భట్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసును విచారించిన స్థానిక పోలీసు అధికారులు విస్తుపోయే విషయాలను గుర్తించారు. భార్యను చంపి… ఆ తర్వాత గూగుల్ లో భార్య మరణిస్తే ఎప్పుడు రెండో వివాహం చేసుకోవచ్చు అని గూగుల్ చేసాడని… భార్య మరణించిన కాసేపటికే అనుమానాస్పద వస్తువులను కొనుగోలు చేసాడని గుర్తించారు.
Also Read : అరబిందోకి మూడింది, రంగంలోకి సిఐడీ, పవన్ హడావుడి వర్కౌట్ అయిందా…?
అతనిపై తీవ్ర హత్యా నేరాలు మోపారు అమెరికా పోలీసులు. ప్రిన్స్ విలియం కౌంటీ సర్క్యూట్ క్రిమినల్ డివిజన్‌లో అతనిపై కేసులు నమోదు అయ్యాయి. భట్‌పై రెండు నేరాలకు సంబంధించి కేసులు నమోదు చేసారు. ఇక కేసు వివరాల్లోకి వెళ్తే అతని భార్య, మమతా కాఫ్లే భట్, జూలై 29న చివరిసారిగా కనిపించింది. నరేష్ హత్య చేసినట్టు గుర్తించినా ఆమె మృతదేహం ఇంకా గుర్తించలేదు. వర్జీనియా గ్రాండ్ జ్యూరీ, మానసాస్ పార్క్ నివాసి అయిన భట్ పై హత్య చేసి శరీరాన్ని మాయం చేసినట్టు కేసులు నమోదు చేసారు.
మమత ఆగస్ట్ 5 న జాబ్ కు వెళ్లకపోవడంతో ఆమె కనపడటం లేదని గుర్తించారు. స్థానిక పోలీసులు ఆమె కోసం గాలిచినా ఆచూకి లభించలేదు. WUSA9 చట్టం ప్రకారం, మమత కనపడకుండా పోయిన కొన్ని రోజుల తర్వాత చనిపోయినట్లు గుర్తించారు. ఇద్దరు విడాకులు తీసుకునే స్థితిలో ఉన్నారని… హత్య కన్నా ముందే… వర్జీనియాలో జీవిత భాగస్వామి కనపడకుండాపోతే ఏ విధమైన చర్యలు ఉంటాయి… భార్య మరణిస్తే ఆమెపై ఉన్న లోన్ మాఫీ అవుతుందా వంటి అనేక విషయాలను అతను గూగుల్ చేసాడు.
Also Read : అదానితో ఒప్పందం రద్దు అయితే, పెనాలిటీ ఎన్ని వేల కోట్లంటే…!
అయితే ఆమె కనపడకుండా పోయిన మరుసటి రోజు అతను వాల్ మార్ట్ లో స్టోర్ లో క్లీనింగ్ సామాగ్రిని కొనుగోలు చేస్తున్నట్లు సీసీ ఫూటేజ్ ద్వారా గుర్తించినట్టు ప్రాసిక్యూటర్లు కోర్ట్ కు తెలిపారు. నరేష్ భట్ తన భార్య అదృశ్యమైన కొద్దిసేపటికే రక్తపు మరకలున్న బాత్ మ్యాట్, బ్యాగులను చెత్త కాంపాక్టర్‌లో పడవేసినట్లు ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. ఆమె ఇంకా బతికే ఉందని అతని న్యాయవాదులు వాదించగా, ఆమె రక్తంలో ఆమె డీఎన్ఏ ఆమెదే అని నిర్ధారించారు. ఆమెను చంపి మృతదేహాన్ని నాశనం చేసాడని అందుకే ఇప్పటికీ మృతదేహం దొరకలేదని పోలీసులు పేర్కొన్నారు.