Wednesday, February 4, 2026 08:15 PM
Wednesday, February 4, 2026 08:15 PM

కేతిరెడ్డికి మ్యూజిక్ స్టార్ట్…?

ఏపీలో టిడిపి సోషల్ మీడియా ఒత్తిడికి లొంగో లేక పవన్ కళ్యాణ్ కామెంట్లకి షాక్ కొట్టో తెలియదు కానీ.. ఇప్పుడు వైసీపీ నేతల అక్రమాల విషయంలో కాస్త సీరియస్ గానే అడుగులు పడుతున్నాయి. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల విషయంలో ఇప్పుడు అక్రమాలను బయటకు తీయడానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రెడీ అయ్యారు. టీడీఆర్ బాండ్ లు అలాగే భూ కబ్జాల విషయంలో సర్కారు సీరియస్ గానే అడుగులు వేస్తోంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఈ అక్రమాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ప్రభుత్వ భూములను ఎక్కువగా దోచుకున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. అందుకే సర్కార్ ఇప్పుడు సీరియస్ గా ఫోకస్ చేసింది.

Also Read : తోక ముడిచి.. ఆరోపణలు ఫేక్ అని ఒప్పుకున్న వైసీపీ..!

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని వడియార్ చెరువు ఆక్రమణలపై అధికారులు కొరడా ఝుళిపించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోదరుడి భార్య గాలి వసుమతికి నోటీసులు పంపారు. సర్వేనెంబర్ 661-1 (908,909,910) లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని జల వనరుల శాఖ నోటీసులు ఇవ్వడంతో చర్యలకు దిగారు. దాదాపు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు నోటీసులో పేర్కొన్న అధికారులు… నోటీసు అందుకున్న ఏడు రోజుల్లో చెరువు భూమిని ఖాళీ చేయాలని నోటీసులో స్పష్టంగా ప్రస్తావించారు. చెరువు భూమిని ఖాళీ చేయకపోతే… స్వాధీనం చేసుకుంటామని నోటీసులో జల వనరుల శాఖ అధికారులు హెచ్చరించడం గమనార్హం.

Also Read : రౌడీషీటర్ కు రాచమర్యాదలా.. సిగ్గు సిగ్గు..!

గతంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బాగోతంపై పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ ఆధారాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన చేతికి మట్టి అంటకుండా సోదరుడు కేతిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి భార్య గాలి వసుమతి పేరుతో ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రధాన అనుచరుడు సూర్యనారాయణకు కూడా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణలపై స్థానిక ఎమ్మార్వో నోటీసులు కూడా ఇచ్చారు. చర్యలు మొదలవడంతో వైసీపీ ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్