భారత క్రికెట్ లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కోసం ఎప్పటినుంచో వేట జరుగుతూనే ఉంది. ఎందరో ఆటగాళ్లను పరీక్షిస్తూనే ఉన్నారు. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ సహా ఎందరో ఆటగాళ్లు జట్టులోకి వచ్చి వెళ్లారు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ విషయంలో భారత జట్టు ఎంతగానో ఇబ్బంది పడుతోంది. ఓవైపు విదేశాల్లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు కీలకంగా మారుతున్న సమయంలో భారత్ మాత్రం ఈ విషయంలో ఏం చేయాలో అర్థం కాక మల్లగుల్లాలు పడుతుంది. ఈ సమయంలో నితీష్ కుమార్ రెడ్డి రూపంలో భారత్ కు నమ్మకమైన ఆల్రౌండర్ దొరికాడని అభిమానులు పండగ చేసుకున్నారు.
Also Read : ఫ్యాన్స్ కు కోహ్లీ మరో షాక్..?
ఆస్ట్రేలియా పర్యటనలో కీలక సమయాల్లో అతను ఆదుకోవడమే కాకుండా అప్పుడప్పుడు వికెట్లు కూడా తీయడంతో ఫాన్స్ లో ఫుల్ జోష్ కనపడింది. అతని గురించి అంతర్జాతీయ మీడియా కూడా హైలెట్ చేసిన పరిస్థితి. మెల్బోర్న్ టెస్ట్ లో అతను చేసిన సెంచరీ చారిత్రాత్మకమే. కానీ ఆ తర్వాత నుంచి అతని ఆట తీరు అంచనాలకు మించి లేదు అనే విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తీవ్రంగా ఫెయిల్ అవుతున్నాడు. ఫీల్డింగ్ మాత్రం పర్వాలేదు అనిపిస్తున్న నితీష్ కుమార్ రెడ్డి, ఇంగ్లాండ్ పర్యటనలో కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.
Also Read : ఇక చాలు.. నెల్లూరులో జగన్‌కు షాక్ తప్పదా..?
ఇంకా వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ లో కూడా అతని నుంచి ఆశించిన ప్రదర్శన లేదని చెప్పాలి. ఇక రెండో టెస్టులో బౌలింగ్ విషయంలో అతనిని పూర్తిగా పక్కన పెట్టారు. ఈ టెస్ట్ లో 200 ఓవర్లకు పైగా భారత బౌలర్లు బౌలింగ్ చేస్తే ఒక్క ఓవర్ కూడా నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ చేయలేదు. ఇక బ్యాటింగ్ లో కూడా దూకుడుగా ఆడే ప్రయత్నమే గాని నిలకడగా ఆడే ప్రయత్నం చేయలేకపోతున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు ఫ్యాన్స్. గౌతమ్ గంభీర్ అతనిని జట్టులో ఎందుకు ఉంచుతున్నాడో అర్థం కావడం లేదంటూ విమర్శిస్తున్నారు. గంభీర్ కారణంగానే నితీష్ జట్టులో కొనసాగుతున్నాడు అనే విషయం స్పష్టంగా అర్థమైంది. అటు హర్షిత్ రానా విషయంలో కూడా గంభీర్ ఇదే వైఖరిని ప్రదర్శించడంపై అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డి టెస్ట్ క్రికెట్ కు సరిపడే ఆటగాడు కాదంటూ.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్త ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కోసం వెతకాలని కోరుతున్నారు.