Tuesday, October 21, 2025 07:23 PM
Tuesday, October 21, 2025 07:23 PM
roots

కాంతారాకు షాక్.. హైకోర్ట్ నిర్ణయం ఏంటో..?

కాంతారా” సౌత్ ఇండియా సినిమా రేంజ్ ను పెంచిన సినిమాల్లో ఒకటి. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి భారీ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది కాంతారా. ఇక ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ వస్తోంది. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కు సిద్దమవుతోంది. ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంతార: చాప్టర్ 1′ విడుదలకు దగ్గర పడుతున్న తరుణంలో, కొత్త వివాదం కర్ణాటక హైకోర్టుకు చేరుకుంది.

Also Read : ఓటీటీ రేట్ లో అఖండ తాండవం.. నెట్ ఫ్లిక్స్ భారీ ధర

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మల్టీప్లెక్స్‌ లతో సహా అన్ని థియేటర్లలో పన్నులు మినహాయించి టిక్కెట్ల ధరలను రూ.200గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్మాణ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసాయి. కాంతారా సినిమాను నిర్మిస్తోన్న హోంబాలే ఫిల్మ్స్, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కీస్టోన్ ఎంటర్టైన్మెంట్ మరియు వికె ఫిల్మ్స్ లతో కలిసి హైకోర్ట్ లో నాలుగు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిఐఎల్) దాఖలు చేశాయి. ఏకరీతి ధరను నిర్ణయించడం వల్ల బాక్సాఫీస్ ఆదాయాలు తగ్గుతాయని, మల్టీప్లెక్స్‌ లు, భారీ బడ్జెట్ సినిమాలపై ఆర్థిక భారం పడుతుందని పిటిషనర్లు కోర్ట్ ముందు తమ వాదనలు వినిపించారు.

Also Read : అనసూయ భరధ్వాజ్

భారీ బడ్జెట్ సినిమాలు నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేసారు. కర్ణాటక ప్రభుత్వం గత వారం సవరించిన కర్ణాటక సినిమాలపై నియమాలను సవరించింది. ఆ తర్వాత ఈ నిర్ణయం అధికారికంగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. 75 సీట్లు లేదా అంతకంటే తక్కువ ఉన్న ప్రీమియం మల్టీ-స్క్రీన్ సినిమా హాళ్ళను మాత్రం మినహాయించింది. ఇక కాంతారా ప్రీక్వెల్.. చాప్టర్ 1, అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్