కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆధారంగా కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. పన్ను స్లాబ్‌లలో మార్పుల మొదలు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI). యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ మొదలు ఎన్నో మార్పులు రానున్నాయి. కొత్త పన్ను శ్లాబులు, రేట్లు మారుతున్నాయి. సంవత్సరానికి రూ. 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు కొత్త పన్ను విధానం ప్రకారం పన్ను చెల్లించే అవకాశం లేదు. అదనంగా, జీతం పొందే వ్యక్తులు రూ. 75,000 ప్రామాణిక మినహాయింపుకు అర్హులు కానున్నారు. అంటే రూ. 12,75,000 వరకు పన్ను ఉండదు.
Also Read : అజ్ఞాతంలోకి మాజీ మంత్రి..!
0-రూ. నుంచి 4 లక్షలకు పన్ను లేదు, రూ. 4 లక్షల నుంచి రూ. 8 లక్షలకు 5 శాతం ఉంటుంది. రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షలకు 10 శాతం ఉంటుంది. రూ. 12 లక్షలు నుంచి రూ. 16 లక్షలకు 15 శాతం ఉంటుంది. రూ. 16 లక్షల నుంచి రూ. 20 లక్షలకు 20 శాతం ఉంటుంది. రూ. 20 లక్షల నుంచి రూ. 24 లక్షలకు 25 శాతం ఉంటుంది. రూ. 24 లక్షలకు పైగా 30 శాతం పన్ను విధిస్తారు. ఇక ఏకీకృత పెన్షన్ పథకం కూడా అమలులోకి రానుంది. ఏకీకృత పెన్షన్ పథకం (UPS) ను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2024లో ప్రారంభించింది.
Also Read : మరో బాంబు పేల్చిన డొనాల్డ్ ట్రంప్
అయితే ఏప్రిల్ 1, 2025 నుండి అమలు చేస్తారు. దీని వల్ల దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. కనీసం 25 సంవత్సరాల సర్వీస్ ఉన్నవారు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను పెంచే క్రమంలో వారి చివరి 12 నెలల జీతంలో 50 శాతం వరకు పెన్షన్ వస్తుంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పై కేంద్రం దృష్టి పెట్టింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల పలు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చే ఈ మార్గదర్శకాల ప్రకారం.. ఉపయోగంలో లేని నెంబర్లకు యూపిఐ సర్వీసులు ఉండవు. కొందరు యూపిఐ యాక్టివేట్ చేసుకుని.. సిం వాడకుండా ఉంటారు. ఇక నుంచి అలా ఉండదు. ఖచ్చితంగా సిం వాడాల్సిందే.




