Wednesday, February 4, 2026 09:32 PM
Wednesday, February 4, 2026 09:32 PM

ఆస్ట్రేలియా టూర్ కు కొత్త కెప్టెన్, జట్టు ఇదే..!

భారత క్రికెట్ లో మరో సంచలన మార్పుకు శ్రీకారం చుట్టింది సెలెక్షన్ కమిటీ. ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మను కెప్టెన్ గా తప్పించి అతని స్థానంలో, యువ ఆటగాడు శుభమన్ గిల్ కు బాధ్యతలు అప్పగించింది. కాసేపటి క్రితం జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సీరీస్ కు గిల్ కు బాధ్యతలు అప్పగించింది. ఆస్ట్రేలియా పర్యటనను బోర్డు అత్యంత కీలకంగా తీసుకున్న సంగతి తెలిసిందే.

Also Read : వైసీపీ నుంచి మరో సీనియర్ అవుట్..!

బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ లో భారత్ ఫెయిల్ కావడంతో.. వన్డే సీరీస్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సీరీస్ పై ఆస్ట్రేలియా కూడా అదే రేంజ్ లో ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్సి విషయంలో మాత్రం బోర్డు సంచలన అడుగులు వేసింది. టెస్ట్ క్రికెట్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తప్పుకోవడం ఒక సంచలనం అయితే, ఇప్పుడు వన్డే కెప్టెన్ పదవి నుంచి కూడా రోహిత్ శర్మను పక్కన పెట్టడం మరో సంచలనంగా చెప్పాలి. అటు శ్రేయాస్ అయ్యర్ కూడా కెప్టెన్ పదవి కోసం ఎదురు చూస్తున్న సమయంలో అతనిని వైస్ కెప్టెన్ ను చేసారు.

ఇంగ్లాండ్ పర్యటనలో కెప్టెన్ గా గిల్ పర్వాలేదు అనిపించాడు. ఆ తర్వాత ఆసియా కప్ కు అతనిని వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసారు. అయితే ఈ టోర్నీలో గిల్ బ్యాటింగ్ లో ఫెయిల్ అయ్యాడు. తాజాగా వెస్టిండీస్ తో తొలి టెస్ట్ లో కూడా అర్ధ సెంచరీ చేసి ఆకట్టుకున్నా.. చెత్త బంతికి అవుట్ కావడంపై అభిమానులు పెదవి విరిచారు. మరి ఆస్ట్రేలియా లాంటి బలమైన దేశంపై వన్డే సీరీస్ లో గిల్ ఏ విధంగా రాణిస్తాడో చూడాలి. ఇక తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి, ఆల్ రౌండర్ సుందర్ కొత్తగా వన్డే జట్టులోకి వచ్చారు. వికెట్ కీపర్ జురెల్ సైతం వన్డే జట్టుకు తొలిసారి అవకాశం లభించింది.

Also Read : బెజవాడలో తగ్గని రద్దీ.. ఆశ్చర్యపోతున్న అధికారులు

జట్టు:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (విసి), అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్, జురెల్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్