Friday, September 12, 2025 03:29 PM
Friday, September 12, 2025 03:29 PM
roots

ఏపీ కొత్త పోలీస్ బాస్ పై వడపోత పూర్తి..!

ఏపీ కొత్త డీజీపీ ఎంపికకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఇన్‌ఛార్జ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్థానంలో కొత్త డీజీపీ ఎంపిక కోసం ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఎంపిక చేసిన ఏపీ సర్కార్… వారి పేర్లను యూపీఎస్సీకి పంపింది. ఆ ఐదుగురిలో ముగ్గురిని యూపీఎస్సీ ఎంపిక చేసి.. ఆ జాబితాను తిరిగి ప్రభుత్వానికి పంపుతుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ఏపీ ప్రభుత్వం డీజీపీగా నియమించే అవకాశం ఉంది. దీంతో ఏపీ కొత్త డీజీపీ ఎవరనే అంశం అటు పోలీస్ వర్గాల్లో.. ఇటు పొలిటికల్ సర్కిల్‌లో కూడా ఉత్కంఠగా మారింది.

Also Read: హైదరాబాద్ లో కుస్తీ తమిళనాడులో దోస్తీ

ఏపీ ప్రభుత్వం మారిన తర్వాత నాటి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన రాజేంద్రనాథ్ రెడ్డిని కూటమి సర్కార్ తొలగించింది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన రాజేంద్రనాథ్ రెడ్డి.. టీడీపీ, జనసేన నేతలపై అక్రమ కేసులు బనాయించడంతో పాటు టీడీపీ నేతలపై వేధింపులకు కూడా పరోక్షంగా కారణమయ్యారనేది ఆరోపణ. అలాగే ప్రతిపక్ష నేతలపై వైసీపీ మూకలు దాడులు చేసినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ, జనసేన నేతలు ఆరోపించారు. దీంతో ఆయన స్థానంలో ద్వారకా తిరుమల రావును చంద్రబాబు సర్కార్ నియమించింది. ఆర్టీసీ ఎండీగా వ్యవహరిస్తున్న ద్వారకా తిరుమల రావు డీజీపీగా పని చేస్తూ రిటైర్ అయ్యారు. దీంతో కొత్త డీజీపీని ప్రభుత్వం నియమించనుంది.

Also Read: మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ

ద్వారకా తిరుమల రావు రిటైర్మెంట్ తర్వాత కొత్త డీజీపీ నియమకం కోసం యూపీఎస్సీకి పేర్లు పంపేందుకు సమయం లేకపోవడంతో.. హరీష్ గుప్తాను ఏపీ సర్కార్ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. 2024 ఎన్నికల సమయంలో కూడా హరీష్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది. దీంతో హరీష్‌ గుప్తా వైపే ఏపీ సర్కార్ మొగ్గు చూపింది. అయితే ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న హరీష్ గుప్తా స్థానంలో పూర్తిస్థాయి డీజీపీ నియామకానికి ప్రభుత్వం నడుం బిగించింది. హరీష్ గుప్తాతో పాటు ఐదు పేర్లను యూపీఎస్సీకి పంపింది. తాజాగా పంపిన ఐదుగురు ఐపీఎస్ అధికారుల పేర్లల్లో రాజేంద్రనాథ్ రెడ్డి, కుమార్ విశ్వజిత్, హరీష్ కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్, సుబ్రహ్మణ్యం పేర్లు ఉన్నాయి. యూపీఎస్సీ నుంచి వచ్చే మూడు పేర్లలో ఒకటి ఏపీ సర్కార్ ఫైనల్ చేయాల్సి ఉంది. కేంద్రంలో కూడా ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది కాబట్టి.. ఏపీ సర్కార్‌కు అనుకూలమైన అధికారినే డీజీపీగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్