ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో సంచలనాలు నమోదు కాబోతున్నాయా..? అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. 2024 లో అధికారం కోల్పోయిన వైసీపీ నుంచి ఇప్పుడు మరి కొంతమంది నేతలు బయటకు రావడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు.. వస్తున్న వార్తలు ఆ పార్టీలో కలవరం పెంచుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చర్యల కారణంగా కొంతమంది వైసీపీ నేతలు ఇబ్బందులు పడుతున్నారు. 2024 ఎన్నికల్లో సీటు రాని మాజీ ఎమ్మెల్యేలు.. అలాగే ఇతర నియోజకవర్గాల్లో ఖర్చు చేసిన నాయకులు ఇప్పుడు అటు ఇటు గాని పరిస్థితిలో ఉన్నారు.
Also Read : మా మీద నీ పెత్తనం ఏమిటీ..!
పార్టీ నుంచి ఫండ్ వస్తుందని ఆశించి కొంతమంది నాయకులు ముందుగానే ఖర్చు చేశారు. సాధారణంగా ఎన్నికల్లో నాయకులకు పార్టీ ఆర్థిక సహకారం అందిస్తూ ఉంటుంది. 2024 ఎన్నికలకు ముందు సైతం.. కొంతమంది నాయకులకు జగన్ మాటిచ్చారట. ఇతర నియోజకవర్గాల్లో ఖర్చు చేస్తే.. నిధులను తాను సర్దుబాటు చేస్తానని, పార్టీ విజయం పై దృష్టి సారించాలని నేతలకు సూచించారట జగన్. కానీ వైసీపీ అధికారం కోల్పోవడంతో జగన్ అప్పటినుంచి నాయకులకు అంటి ముట్టనట్టుగానే అందుబాటులో ఉంటున్నారు.
Also Read : జోగి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!
దీనితో పెట్టుబడి పెట్టిన ఎందరో నేతలు.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. దానికి తోడు గతంలో చేసిన కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టడంతో ఇప్పుడు పలువురు నేతలు తమ రాజకీయ భవిష్యత్తుతో పాటుగా, వ్యక్తిగత ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పార్టీలు మారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో నెల్లూరు జిల్లా నేతలు ముందున్నారు. ఇప్పుడు వీరు పార్టీ మారడమే మంచిది అనే అభిప్రాయానికి వచ్చి.. బిజెపిలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : 30 ఏళ్ళకే గుండెపోటు ఎందుకొస్తుంది?
వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ అధికారంలోకి వచ్చే సంకేతాలు కనపడటం లేదు అనే మాట ఆ పార్టీ నాయకుల్లోనే వినపడుతోంది. తాము వైసీపీలో కొనసాగితే భవిష్యత్తులో మరింత ఖర్చు పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. తమకు భవిష్యత్తులో అవకాశాలు వస్తాయో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. దీనితో బిజెపి లేదా టిడిపిలోకి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. జనసేన పార్టీలోకి ఇప్పటికే కొందరు నేతలు వెళ్ళగా మరి కొంతమంది కూడా వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు వైసిపి వర్గాలు అంటున్నాయి.