Friday, September 12, 2025 08:57 PM
Friday, September 12, 2025 08:57 PM
roots

దిక్కులేకుండా సింహపురి వైసీపీ..!

వైసీపీకి ఇప్పట్లో కోలుకోవడం చాలా కష్టం. ఇందుకు ప్రధాన కారణం.. పార్టీని ముందుండి నడిపించే లీడర్ లేకపోవడం. క్షేత్రస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వై నాట్ 175 అని ఎన్నికల ముందు గొప్పగా చెప్పిన జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. అసెంబ్లీలో తనకు కూడా లీడర్ ఆఫ్ ది హౌస్‌తో సమానంగా మాట్లాడే సమయం కేటాయించాలని డిమాండ్ చేశారు. అది సాధ్యం కాదని తెలిసినా కూడా చిన్న పిల్లాడిలా మారాం చేశారు జగన్. చివరికి అదే సాకుతో సభకు వెళ్లటం లేదు కూడా. ఇక ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా జగన్‌కు ముఖం చెల్లడం లేదు. ఐదేళ్ల పాలనలో జగన్ సర్కార్ ఎన్నో అరాచకాలు చేసింది. ఇప్పుడు అవన్నీ బయటపెడుతోంది కూటమి ప్రభుత్వం. దీంతో ఎందుకు వచ్చిన తలనొప్పి అన్నట్లుగా సైలెంట్‌గా బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్‌కు జగన్ తన మకాం మార్చేశారు.

Also Read : ఏపీ ఫైబర్ నెట్ లో కీలక పరిణామం

యధారాజా తథాప్రజ అన్నట్లుగా అధినేత బాటలోనే పార్టీ నేతలు కూడా నడుస్తున్నారు. పార్టీకి, నేతలకు అధినేత జగనే దూరంగా ఉండగా లేనిది… జిల్లా అధ్యక్షులు దూరంగా ఉంటే తప్పేంటి అనే మాట ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. ఇందుకు ఉదాహరణగా కాకాణి గోవర్థన్ రెడ్డి పేరు ప్రస్తావిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్థన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దాదాపు రూ.2 వేల కోట్ల కుంభకోణం జరిగిందని.. కాకాణిని అరెస్టు చేయాలనేది టీడీపీ నేతలు ఆరోపణ. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతోనే దాదాపు నెల రోజులుగా కాకాణి పరారీలో ఉన్నారు. నెల్లూరు జిల్లా పోలీసులు కాకాణి కోసం డేగ కళ్లతో గాలిస్తున్నారు. హైదరాబాద్, బెంగళురు, చెన్నై తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి కాకాణి కోసం జల్లెడ పడుతున్నారు. కాకాణి బంధువులు, స్నేహితుల నివాసాలపై నిఘా పెంచారు. దేశం విడిచి వెళ్లకొండ లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.

Also Read : ఏపీ పోలీస్ భేష్.. మొదటి స్థానంలో తెలంగాణా 

అయితే నెలరోజులుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు అందుబాటులో లేకపోవడంతో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు, కార్యకర్తలు కలవరపడుతున్నారు. పార్టీ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదంటున్నారు. కార్యకర్తలకు ధైర్యం చెప్పాల్సిన లీడర్.. ఇలా అజ్ఞాతంలోకి వెళ్లిపోతే.. ఇక మిగిలిన క్యాడర్ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై జిల్లాకు చెందిన సీనియర్ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ కూడా నోరెత్తడం లేదు. కనీసం కార్యకర్తలతో సమావేశం కూడా కావడం లేదు. దీంతో తమకు దిక్కెవరు రా నాయనా అంటూ వైసీపీ నేతలు వాపోతున్నారు. కొంతమంది అయితే.. సైలెంట్‌గా అధికార టీడీపీలోకి జంప్ అవుతున్నారు. దీంతో సింహపురి జిల్లాలో వైసీపీకి దిక్కే లేకుండా పోతోందనే రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్