Saturday, September 13, 2025 03:13 AM
Saturday, September 13, 2025 03:13 AM
roots

ఎన్ సిఏ పేస్ గన్ రెడీ అవుతుందా…? టార్గెట్ ఆస్ట్రేలియా…!

భారత క్రికెట్ బౌలింగ్ అంటే స్పిన్… నిఖార్సైన పేసర్లు ఇండియన్ క్రికెట్ కు దొరికి చాలా కాలం అయింది. ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్ తరహాలో పేస్ బౌలింగ్ భారాన్ని విదేశాల్లో మోసే బౌలర్లు దొరకడం చాలా కష్టమైపోయింది. మహ్మద్ షమీ, జస్ప్రీత్ బూమ్రా ఉన్నా గాయాల సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. బూమ్రా ఈ మధ్యనే కాస్త నిలకడగా జట్టులో ఉంటున్నాడు. షమీ ఇంకా గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకోలేదు. కోలుకున్నా కూడా ఇంకో రెండు మూడేళ్ళు మాత్రమే అతను కొనసాగే అవకాశం ఉంది.

మరి తర్వాత భారత్ పేస్ బౌలింగ్ భారాన్ని మోసేది ఎవరు…? మహ్మద్ సిరాజ్ ను నమ్మే పరిస్థితి అయితే లేదు. చిన్న జట్ల మీద మినహా అతను అగ్ర శ్రేణి జట్లపై ప్రభావం చూపిన దాఖలాలు చాలా తక్కువ. ఆకాష్ దీప్ ఇప్పుడు కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు. కానీ నిలకడగా రాణిస్తాడా అనేది చెప్పలేం. అందుకే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని బోర్డు యువ బౌలర్లకు సాన పెడుతోంది. షమీ తర్వాత భారత బౌలింగ్ కు బూమ్రా నాయకత్వం వహిస్తాడు. త్వరలోనే ఆస్ట్రేలియా సీరీస్ ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై ఆడాల్సి ఉంటుంది.

ఆస్ట్రేలియాలో ఆడాలి అంటే ఖచ్చితంగా పేస్ బౌలింగ్ తోనే రంగంలోకి దిగాలి. అందుకనే ఇప్పుడు బోర్డ్ పక్కా ప్లాన్ తో ఆస్ట్రేలియాలో అడుగు పెట్టాలని భావిస్తోంది. అందుకోసం మయాంక్ యాదవ్ అనే యువ బౌలర్ కు ఎన్సీఏలో సాన పెడుతోంది. ఐపిఎల్ లో అతని బౌలింగ్ చూసిన చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్… హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. బౌలింగ్ లో వేరియేషన్స్ చాలా ముఖ్యం. బంతి విసరడం కాదు.. ఎక్కడ, ఎలా విసురుతున్నాం అనేదే ముఖ్యం. ఈ విషయంలో మయాంక్ యాదవ్ పక్కాగా ఉన్నాడు.

Read Also : పవన్ వన్ మ్యాన్ షో, చంద్రబాబు గేమ్ ప్లాన్ సక్సెస్…?

150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేస్తున్నా… బ్యాట్స్ మ్యాన్ ను టార్గెట్ చేయడంలో పక్కాగా ఉంటున్నాడు. వేగంతో పాటు ఖచ్చితత్వం అతని బౌలింగ్ లో ఉంది. ఉప ఖండపు పిచ్ లపైనే అలా ఉంటే ఆస్ట్రేలియా లాంటి పేస్ కు అనుకూలంగా ఉండే పిచ్ లపై ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఐపిఎల్ నుంచి గాయం కారణంగా వైదొలిగినా… ఇప్పుడు ఆస్ట్రేలియా సీరీస్ కోసం రెడీ అవుతున్నాడు. అతనితో దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్ ఆడించే అవకాశం ఉన్నా కూడా ఆడించలేదు. ఆస్ట్రేలియా సీరీస్ కోసం అతను జట్టులోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది.

బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో వెంకటేష్ ప్రసాద్, జవగళ్ శ్రీనాథ్ వంటి బౌలింగ్ దిగ్గజాలు అతనికి శిక్షణ ఇస్తున్నారు. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి. అయితే గాయాల బారిన పడకుండా కాపాడుకోవాల్సి ఉంటుంది. పేస్ బౌలర్ల కెరీర్ ఆగిపోయేది అక్కడే. అన్నీ అనుకున్నట్టు జరిగితే మాత్రం శమీ, బూమ్రా, ఆకాష్ దీప్, మయాంక్ ల బౌలింగ్ విభాగం ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ పై యుద్దానికి దిగవచ్చు. మరి సెలెక్షన్ కమిటీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్