తమిళ సినిమా పరిశ్రమలో నటీ నటుల మధ్య విభేదాలు అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాయి. తాజాగా నయనతార, ధనుష్ మధ్య ఊహించని వివాదం రేగింది. నయనతార జీవితం ఆధారంగా నెట్ ఫ్లిక్స్ సంస్థ ఓ డాక్యుమెంటరి ప్లాన్ చేసింది. ఈ డాక్యుమెంటరిలో నయనతార భర్త, దర్శకుడు విజ్ఞేశ్ శివన్ దర్శకత్వంలో… నయనతార, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వచ్చిన నానుం రౌడి దాన్ సినిమాలో ఓ క్లిప్ వాడటం పట్ల ఆ సినిమా నిర్మాత, హీరో ధనుష్ లీగల్ నోటీసులు పంపారు. ఆ నోటీసులపై నయనతార బహిరంగ లేఖ రాసారు.
Also Read : డాకూ మహారాజ్ టార్గెట్ 350 కోట్లు.. టాలీవుడ్ లో కొత్త జోష్
ధనుష్… ఆడియో లాంచ్ ఈవెంట్స్ లో మాట్లాడినంత నిజాయితీగా నిజ జీవితంలో కూడా ఉండాలని హితవు పలికారు. తన కెరీర్ లో ఆ సినిమా ది బెస్ట్ ఫిలిం అని… అందులోని పాటలు కూడా చాలా బాగుంటాయని… అయినా సరే మేము కేవలం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఓ క్లిప్ ను మాత్రమే వినియోగించాం అని తెలిపారు. అది కూడా మూడు సెకన్ల క్లిప్ అయినా మీరు 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం షాకింగ్ ఉందని… వ్యాపార సమస్యలు, ఆర్ధిక సమస్యలు ఉంటే డిమాండ్ చేసినా తప్పు లేదని సినిమా విడుదలై పదేళ్ళు అయినా సరే ఇంత నీచంగా ప్రవర్తించడం తగదు అంటూ లేఖలో పేర్కొంది నయనతార.
Also Read : ప్రభాస్ లైనప్ చూస్తే కళ్ళు తిరగాల్సిందే..!
దేవుడే న్యాయ నిర్ణేత అని… మనం చేసేవి అన్నీ దేవుడు చూస్తాడు అంటూ ఆమె ఆ లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేసారు. దీనితో అసలు ఈ ఇద్దరి మధ్య వివాదం ఏంటీ అంటూ పలువురు సోషల్ మీడియాలో వెతికే పనిలో పడ్డారు. మేటర్ ఏంటీ అంటే ఆ సినిమా షూటింగ్ టైంలో సెట్స్ కు వచ్చిన ధనుష్… నయనతార యాక్షన్ నచ్చలేదు అని… ఆమె యాక్టింగ్ స్కిల్స్ పెంచుకోవాలి అని సూచించాడు. కానీ నయనతార నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాలో నయన్… చెవిటి అమ్మాయిగా నటిస్తుంది. ఆమెకు ఫిలిం ఫేర్ అవార్డు కూడా రావడం గమనార్హం. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొంది. మరి ఈ లీగల్ వివాదంను వారిద్దరూ ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి.




