Monday, October 27, 2025 10:33 PM
Monday, October 27, 2025 10:33 PM
roots

బ్రేకింగ్: వేశ్య కామెంట్స్ పై జాతీయ మహిళా కమీషన్ సీరియస్.. డీజీపీకి లేఖ

దాదాపు వారం రోజుల నుంచి అమరావతి విషయంలో సాక్షి ఛానల్ లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన డిబేట్ లో కృష్ణం రాజు అనే జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీనిపై కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కృష్ణం రాజు కోసం కూడా పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. ఇప్పటికే పలు బృందాలు అయన కోసం గాలిస్తున్నాయి. దీని పై రాష్ట్ర డిజిపి కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

Also Read : అది సంకర జాతి కాదా సజ్జల..?

ఇదిలా ఉంచితే ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. అమరావతిపై జగన్ మీడియా అసభ్య వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిజిపికి జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జర్నలిస్ట్ వి.వి.ఆర్. కృష్ణం రాజు టీవీ డిబేట్ సందర్భంగా అమరావతిలోని మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సుమోటాగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్.. దీనిపై చర్యలకు రంగం సిద్దం చేసింది. వెంటనే తీసుకున్న చర్యలు తమకు తెలియజేయాలని పేర్కొంది. జాతీయ మహిళా కమిషన్ కు టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు రాసిన లేఖను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.

Also Read : తప్పు చేస్తే.. ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే..!

అమరావతిని “వేశ్యల రాజధాని”గా సంబోధించడం అనేది రాజధాని ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన మహిళా రైతులను తీవ్రంగా అవమానించడమేనని జాతీయ మహిళా కమిషన్ అభిప్రాయపడింది. ఈ అసహ్యకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తోందని.. జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ విజయా రహట్కర్ స్పష్టం చేసారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డీజీపీకి లేఖ రాసారు జాతీయ మహిళా కమిషన్ చైర్మన్. తక్షణమే నిర్దిష్ట కాలపరిమితిలో విచారణ జరిపి సంబంధిత చట్టాల ప్రకారం కృష్ణం రాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. 3 రోజుల్లోగా కృష్ణంరాజుపైన తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను పంపించాలని కూడా డిజిపికి ఆదేశాలను జారీ చేసింది జాతీయ మహిళా కమిషన్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్