ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి మూడు రోజులపాటు అమెరికా పర్యటనలో ఉండనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, . అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వస్థలం విల్మింగ్టన్‌లో జరిగే ఈ సమ్మిట్‌లో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి, సంక్షేమం గురించి చర్చించనున్నారు. పర్యటన సమయంలో మోదీ న్యూయార్క్‌లోని UN జనరల్ అసెంబ్లీలో ఫ్యూచర్ సదస్సులో ప్రసంగించనున్నారు. అలాగే, వివిధ పరిశ్రమలకి చెందిన వ్యాపారవేత్తలతో భేటీ కావడం మరో కీలక అంశంగా ఈ పర్యటన కొనసాగనుంది.

బైడెన్‌తో భారత్ – అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం, భారత ప్రజల ప్రయోజనాలపై కూడా చర్చలు జరగనున్నాయి. అమెరికాలో ఎన్నికలు జరగనున్న తరుణంలో మోడీ పర్యటన పై అమెరికా రాజకీయ పరిశీలకులు, మీడియా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాయి. ట్రంప్ భారత ఓటర్లని ఆకర్షించే ప్రయత్నం చేస్తుండగా, మోడీ అమెరికా పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత సంతతి ప్రజలకు మోడీ ఏదైనా సందేశం ఇస్తారేమో అని డెమొక్రాట్ మరియు రిపబ్లిక్ పార్టీల నాయకులు ఆశాభావంతో ఉన్నారు.