Monday, October 20, 2025 05:19 PM
Monday, October 20, 2025 05:19 PM
roots

బీఎస్ఎన్ఎల్ సరికొత్త అడుగు.. భారత్ నూతన అధ్యాయం..!

టెలి-కమ్యూనికేషన్ రంగంలో భాగంగా.. మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తోన్న కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక అడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం బిఎస్ఎన్ఎల్ ‘స్వదేశీ’ 4G నెట్వర్క్ కు శ్రీకారం చుట్టారు. దీనితో టెలికాం పరికరాలను తయారు చేసే దేశాల జాబితాలోకి భారత్ అడుగు పెట్టింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ రజతోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి 97,500 కి పైగా మొబైల్ 4G టవర్లను ప్రారంభించారు. వాటిలో టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కు చెందిన 92,600 4జీ టెక్నాలజీ సైట్లు కూడా ఉన్నాయి.

Also Read : టీటీడీ సంచలన నిర్ణయం.. ఇక కఠిన చర్యలు

ఈ టవర్లను దాదాపు రూ.37,000 కోట్ల వ్యయంతో ‘స్వదేశీ’ సాంకేతికత పరిజ్ఞానంతో నిర్మించారు. ‘స్వదేశీ’ 4జీ నెట్వర్క్ ప్రారంభంతో, స్వదేశీ టెలికాం పరికరాలను తయారు చేసే డెన్మార్క్, స్వీడన్, దక్షిణ కొరియా మరియు చైనా వంటి దేశాల జాబితాలోకి భారత్ అడుగు పెట్టింది. భారత్ లో తయారు చేసిన ఈ నెట్వర్క్ క్లౌడ్ ఆధారంగా పని చేస్తుంది. ఆ తర్వాత 5 జీ నెట్వర్క్ ను కూడా సులువుగా ప్రారంభించే అవకాశం ఉంటుంది. దీనితో ఒడిశాలోని 2,472 గ్రామాలతో సహా, మారుమూల, సరిహద్దు, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలోని 26,700 కి పైగా గ్రామాలకు నెట్వర్క్ అందనుంది.

Also Read : చంద్రబాబు సీరియస్.. బాలయ్య క్షమాపణ చెప్తారా..?

20 లక్షలకు పైగా కొత్త సబ్‌ స్క్రైబర్‌ లకు సేవలందిస్తుందని ప్రకటన బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఈ టవర్లు అన్నీ పూర్తిగా సౌరశక్తితో పని చేస్తాయి. డిజిటల్ భారత్ నిధి ద్వారా భారత్ కు చెందిన 100 శాతం 4జీ నెట్‌వర్క్‌ను కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా 29,000 నుండి 30,000 గ్రామాలు మిషన్-మోడ్ ప్రాజెక్ట్‌ లో అనుసంధానించారు. ఆంధ్రప్రదేశ్ లో సిఎం చంద్రబాబు నాయుడు ఈ సేవలను ప్రారంభించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్