ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి మరో మైలురాయిగా, మంత్రి నారా లోకేష్ మే 8, 2025న తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో LG ఎలక్ట్రానిక్స్ రూ.5,001 కోట్ల తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్ దక్షిణ భారతదేశంలో LG యొక్క మొదటి యూనిట్ మరియు దేశంలోని పూణే, నోయిడా తర్వాత మూడవ యూనిట్. ఈ ప్రాజెక్టు 2,000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని, అదనంగా రూ.839 కోట్లతో ఐదు సహాయక యూనిట్లు మరో 500 ఉద్యోగాలను అందిస్తాయని అంచనా.
Also Read : మాకే పాపం తెలియదు.. జగన్ ను ఇరికించిన కృష్ణ మోహన్ రెడ్డి
ఏపీని ఎలక్ట్రానిక్స్ పవర్ హౌస్ గా మార్చేందుకు ప్రజా ప్రభుత్వం బాటలు వేస్తోందని మంత్రి లోకేష్ అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మేడ్ ఇన్ ఆంధ్ర నుండి మేడ్ ఫర్ ది వరల్డ్ వరకు జైత్రయాత్ర కొనసాగుతుందన్నారు మంత్రి. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక తొలి ఎఫ్ డిఐ శ్రీసిటీ ఎల్ జి యూనిట్ అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఎపి ఉండబోతుందని తెలిపారు. ఎల్ జి శ్రీసిటీ యూనిట్ కు మంత్రి లోకేష్ భూమిపూజ చేసిన అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : జగన్ ఇంటి తలుపు తట్టిన లిక్కర్ స్కామ్
మేం ఈరోజు ఎల్ జి యూనిట్ కు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ఒక నిర్మాణ ప్రాజెక్టు ప్రారంభం కంటే పెద్దదన్నారు ఆయన. ఇది మన రాష్ట్రంతోపాటు భారతదేశ పారిశ్రామిక వృద్ధి, సాంకేతిక పురోగతిలో ఒక మైలురాయి అని స్పష్టం చేసారు. ఎల్ జి ప్రధాన యూనిట్ దాదాపు 1,500 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు. ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు ఆంధ్ర ఆశయాన్ని నెరవేర్చినప్పుడు మాయాజాలం జరుగుతుందన్నారు.
Also Read : మన సైన్యం బలమెంత.. యుద్ధం వస్తే పాక్ పరిస్థితి ఏంటీ..?
ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రపంచస్థాయి కేంద్రంగా ఎపిని మార్చాలనే మా ఆశయాన్ని ఎల్ జి సంస్థ ముందుకు తీసుకెళ్తోందన్నారు. శ్రీ సిటీ పారిశ్రామిక పురోగతికి ఒక చుక్కానిలా మారిందన్న ఆయన.. ఇలాంటి ప్రాజెక్టులతో మేము మేము ఏపీ భవిష్యత్తును నిర్మిస్తున్నామన్నారు. స్మార్ట్ ఉద్యోగాలను సృష్టిస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నామని.. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికాభివృద్ధికి, అధునాతన ఆవిష్కరణలకు అవసరమైన వాతావరణాన్ని కల్పించడానికి మేం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసారు.




