Wednesday, February 4, 2026 11:09 AM
Wednesday, February 4, 2026 11:09 AM

ఎవడ్నీ వదలను.. లోకేష్ హాట్ కామెంట్స్

టీడీపీ నేతల విషయంలో లేని పోనీ కథనాలు ప్రచారం చేయడంలో వైసీపీ అనుకూల మీడియా ఎప్పుడూ దూకుడు ప్రచారం చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా నారా కుటుంబం విషయంలో వైసీపీ మీడియా సాక్షి రాసే రాతలు మనం చూస్తూనే ఉంటాం. వ్యక్తిగత విషయాలను కూడా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా రాస్తూ ఉంటుంది సాక్షి. అలా మంత్రి నారా లోకేష్ విషయంలో గతంలో రాసిన ఓ కథనం తీవ్ర వివాదం అయింది. లోకేష్ చిరు తిండికి 25 లక్షలు ఖర్చు అయిందని సాక్షి కథనం రాయగా.. లోకేష్ పరువు నష్టం దావా వేసారు.

Also Read : ఏపీలో సీనియర్ల వైరాగ్యం.. రాజకీయాలకు గుడ్ బై..?

తాజాగా ‘సాక్షి’ పత్రికపై పరువు నష్టం దావా కేసులో, విశాఖ జిల్లా కోర్టులో మంత్రి నారా లోకేష్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ జరిగింది. కేసు విచారణను ఈ నెల 21కి న్యాయమూర్తి వాయిదా వేసారు. కావాలనే తనను కించపరిచేలా సాక్షిలో కథనాలు.. తప్పుడు రాతలపై పోరాటం చేస్తామని స్పష్టం చేసారు. సాక్షి కథనం తప్పని కోర్టుకు ఆధారాలు చూపించాను అన్నారు. ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రభుత్వ సొమ్మును నా సొంత ఖర్చులకు ఎప్పుడూ వాడలేదని స్పష్టం చేసారు.

Also Read : ఐఏఎస్ భార్య మృతి.. ఎన్నో అనుమానాలు..!

సామాజిక మాధ్యమాల్లో వేధింపులు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవు.. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. ఇక భోగాపురం విమానాశ్రయం గురించి మాట్లాడిన లోకేష్.. ‘ఎర్రబస్సు ఆగని ఊరుకు ఎయిర్‌పోర్టు అవసరమా’ అని నాడు జగన్ అనలేదా..? అని నిలదీశారు. ‘పట్టిసీమ దండగ’ని జగన్ అన్నారు.. దాన్నే ఐదేళ్లు వాడుకున్నారన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు మేం ఎక్కడా చిల్లు పెట్టలేదు.. మిగిలిన నీళ్లను తెలంగాణ వాడుకోవచ్చని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు.. జరగనివ్వమని స్పష్టం చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్