దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక ట్రాన్స్‌మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీగా అమరావతిని అభివృద్ధి చేయడం చంద్రబాబు నాయుడు కల. ఈ కలను వాస్తవం చేసేందుకు, నారా లోకేష్ అమెరికాలో ప్రాధాన్యమైన పరిశ్రమ నిపుణులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ఫౌండర్ సజన్ రాజ్ కురుప్, సీనియర్ పార్టనర్ ఇయాంగ్ కాపింగ్, హాలీవుడ్ డైరెక్టర్ & స్క్రీన్‌రైటర్ చిక్ రసెల్‌తో జరిగిన భేటీలో ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలని లోకేష్ కోరారు.
Also Read : సీన్ లోకి తమిళ హీరో..? అఖండకు లైన్ క్లియర్..?
ఈ ట్రాన్స్‌మీడియా సిటీ ప్రాజెక్ట్ ద్వారా అమరావతిని ప్రపంచ స్థాయి క్రియేటివ్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళిక సిద్ధమైంది. ఏఐ ఆధారిత వర్చువల్ స్టూడియోలు, ఏఆర్/వీఆర్ థీమ్ పార్కులు, అత్యాధునిక కో-ప్రొడక్షన్ సౌకర్యాలు, గేమింగ్–యానిమేషన్–VFX రంగాలకు ప్రత్యేక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి ఫీచర్లు ఈ ప్రాజెక్ట్‌లో భాగం. అదనంగా, “క్రియేటర్ ల్యాండ్ అకాడమీ” ద్వారా స్థానిక యువతకు అత్యాధునిక టెక్నాలజీలపై కటింగ్ ఎడ్జ్ ట్రైనింగ్ అందించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
ఈ మెగా ప్రాజెక్ట్‌తో రాష్ట్రంలో భారీ పెట్టుబడులు రాబోతున్నాయి. ₹10,000 కోట్ల పెట్టుబడులు, 1.5 లక్షల ఉద్యోగాల సృష్టి ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. భవిష్యత్తు వినోద, టెక్, గేమింగ్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న క్రియేటివ్-టెక్ రంగాల్లో స్థానిక యువతకు అద్భుత అవకాశాలు ఏర్పడనున్నాయి.
Also Read : కేంద్రం సంచలనం.. వన్ నేషన్ వన్ స్టూడెంట్..!
గత ఏడాది మే 4న ప్రభుత్వం–క్రియేటివ్ ల్యాండ్ ఆసియా మధ్య ఒప్పందం కుదిరినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆ ఒప్పందం ప్రకారం 24 నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఆ దిశగా ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ ప్రారంభమైతే, అమరావతి పరిపాలనా రాజధానిని దాటి, దేశంలోని తొలి ‘క్రియేటివ్ క్యాపిటల్’గా ఎదిగి కొత్త ట్రెండ్‌ను సెట్ చేయనుంది.

