Thursday, March 26, 2026 08:25 PM
Thursday, March 26, 2026 08:25 PM

ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ పదిలం

కుప్పం నియోజకవర్గంలో పరిశ్రమల రాకతో అభివృద్ధికి మహర్దశ ప్రారంభమవుతుందని, అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించారని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. నాలుగు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా మూడో రోజు ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శాంతిపురం మండలం శివపురంలో స్థానిక నేతలతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించిన అనంతరం శాంతిపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు.

తదుపరి కార్యక్రమాల్లో భాగంగా రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐటీడీపీ కార్యకర్త రవి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. రామకుప్పం, మణేంద్ర ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. అలాగే రామకుప్పంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బల్ల గ్రామంలో మహిళలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్త ముజాహిద్ కుటుంబాన్ని కలుసుకుని సంక్షేమ పథకాల అమలుపై వివరాలు తెలుసుకున్నారు. గోవిందపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన కార్యకర్త ఆనంద్ కుటుంబానికి పరామర్శించి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Also Read : అమరావతి చట్టబద్దత.. వైసీపీ సవాల్‍‌.. ధైర్యం ఉందా..?

రామకుప్పంలో జరిగిన నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు హాజరయ్యారు. వారితో కలిసి కిలోమీటరు మేర నడిచిన భువనేశ్వరి, ఎన్టీఆర్ “సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారని గుర్తు చేశారు. పేదల అభ్యున్నతి కోసం రూ.2కే బియ్యం పథకం అమలు చేసిన మహనీయుడని, మహిళలకు ఆస్తి హక్కులు, రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్థాపనతో మహిళా విద్యకు ప్రోత్సాహం ఇచ్చారని తెలిపారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ స్పూర్తితోనే చంద్రబాబు పాలన కొనసాగుతోందని భువనేశ్వరి పేర్కొన్నారు. డ్వాక్రా ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి మార్గం సుగమం చేశారని, పేదలకు అన్నం అందించేందుకు అన్న క్యాంటీన్లు ప్రవేశపెట్టారని వివరించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుప్పం అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని భువనేశ్వరి తెలిపారు. స్వర్ణాంధ్ర, స్వర్ణ కుప్పం లక్ష్యంగా పనిచేస్తున్నారని, రాష్ట్రానికి పెట్టుబడులు పెరుగుతున్నాయని చెప్పారు. చంద్రబాబు గారిని 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కుప్పం ప్రజలకు రుణపడి ఉంటామని, కుప్పానికి పరిశ్రమల రాకతో స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని గుర్తు చేశారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం కింద కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఆర్థిక సాయం చేస్తున్నారని, విశాఖలో గూగుల్ డేటా సెంటర్, అనకాపల్లి జిల్లాలో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటవుతున్నాయని తెలిపారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో చర్యలు కొనసాగుతున్నాయని, తల్లికి వందనం, దీపం వంటి పథకాల ద్వారా కుటుంబాలు, మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. సంజీవని ప్రాజెక్టు, సోలార్ ప్యానెల్స్, చెత్త నుంచి సంపద కేంద్రాలు, హంద్రినీవా ద్వారా నీటి సరఫరా వంటి కార్యక్రమాలతో కుప్పం అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అమరావతి చట్టబద్దత.. వైసీపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ...

అమరావతి అగ్నిప్రమాదాలపై ఏపీ...

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని...

ఆ రెండు జిల్లాలే...

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ...

బ్రేకింగ్: జగన్ కు...

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్...

పెద్దిరెడ్డికి బిగుస్తోన్న ఉచ్చు.....

వైసీపీ హయాంలో అన్నీ తానై చెలరేగిపోయి.....

పీవీ సునీల్ కుమార్...

ఏపీ మాజీ సీఐడీ చీఫ్, సీనియర్...

పోల్స్