Wednesday, February 4, 2026 12:24 PM
Wednesday, February 4, 2026 12:24 PM

నవంబర్ రేసులో మెగాస్టార్, యువసామ్రాట్..!

నవంబర్ నెలలో టాలీవుడ్ ఇద్దరు సూపర్ స్టార్లు పోటీ పడుతున్నారు. తెలుగు ఇండస్ట్రీకి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నాలుగు మూల స్తంభాలుగా కొనసాగుతున్నారు. ఈ నలుగురు హీరోలో ఒకరితో ఒకరు పోటా పోటీగా సినిమాలు తీయటం, రిలీజ్ చేయడం కూడా చేశారు. 2017లో కూడా చిరంజీవి, బాలకృష్ణ సంక్రాంతి రేసులో నిలిచారు. చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 జనవరి 11న విడుదలైతే.. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్ర పరిశ్రమలో హీరోలంతా కలిసే మెలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అభిమానులు మాత్రం మా హీరో గ్రేట్ అంటే మా హీరో గ్రేట్ అంటున్నారు. అయితే హీరోల్లో మాత్రం ఆ బేషజాలు ఏ మాత్రం లేవు.

Also Read : నాగార్జునకు సురేఖ సారీ.. కారణం అదేనా..?

ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో రీ రిలీజ్ సందడి నడుస్తోంది. పదేళ్ల నాటి సినిమాలు మొదలు.. హీరోలకు పేరు తీసుకువచ్చిన పాత సినిమాలను కూడా మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. ఈ రీ రిలీజ్ చేసే ముందు వాటిని 4K కు మార్చేసి DOLBY ATMOS సౌండ్ సిస్టమ్‌తో రీ మిక్స్ చేసి ప్రేక్షకులకు కొత్త సినిమా అనుభూతి ఇస్తున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా కొత్త సౌండ్ ఎఫెక్ట్ కోసం థియేటర్లకు వస్తున్నారు. నిజానికి గతంలో ఏడాదికి 2 నుంచి 3 సినిమాలు కూడా రిలీజ్ చేశారు హీరోలు. కానీ ఇప్పుడు మాత్రం ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఏడాదికి ఒక సినిమా కూడా రావటం లేదు. దీని వల్ల ఆయా హీరోల అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 2023 సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్యతో చిరంజీవి హిట్ కొట్టారు. మళ్లీ 2026 సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మన శివశంకర వరప్రసాద్ గారు సినిమాలో నటిస్తున్నారు. ఇక నాగార్జున ఈ ఏడాది రిలీజ్ అయిన కుబేర, కూలి సినిమాల్లో నటించారు.

తాజాగా ఈ నవంబర్ నెలలో చిరంజీవి, నాగార్జున ఒకరితో ఒకరు మరోసారి పోటీ పడుతున్నారు. అయితే ఇద్దరు హీరోలు తనకు ఎంతో పేరు తెచ్చిన నాటి సినిమాలతో అభిమానులను అలరించనున్నారు. 1989లో విడుదలైన శివ సినిమా భారతీయ చలన చిత్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన తొలి సినిమా. ఇళయరాజ అద్భుత స్వర కల్పనలో వచ్చిన శివ సినిమా.. అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమాలో సైకిల్ చైన్ సీన్ నెవర్ బిఫోర్.. నెవర్ ఆఫ్టర్. ఈ సినిమాను అన్నపూర్ణ సంస్థ నిర్మించింది. 36 ఏళ్ల తర్వాత ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రీ రిలీజ్ కోసం అన్నపూర్ణ సంస్థ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తోంది. 4K లో సినిమా ప్రేక్షకులను కొత్త అనుభూతి ఇస్తుందని దర్శకుడు వర్మ ఇటీవల ప్రకటించారు కూడా.

Also Read : వైసీపీలో కలకలం.. అప్రూవర్‌గా ధర్మారెడ్డి..!

ఇక చిరంజీవి హీరోగా నటించిన కొదమసింహం కూడా ఈ ఏడాది నవంబర్ 20న రీ రిలీజ్ చేస్తున్నారు. 1990 ఆగస్టులో రిలీజ్ అయిన కొదమసింహం సినిమాలో చిరంజీవి కౌబాయ్ గెటప్‌లో నటించారు. ఈ సినిమాను హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజరీ అనే పేరుతో ఇంగ్లీష్‌లో కూడా అనువదించబడింది. అప్పట్లో ఇదో ట్రెండ్ సెట్టర్ కూడా. ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ పాడుతూనే ఉన్నారు. రాజ్ – కోటి ద్వయం ఈ సినిమాకు సంగీతం అందించింది. రాధ, సోనం, వాణి విశ్వనాథ్ హీరోయిన్లుగా మోహన్ బాబు విలన్‌గా నటించిన సినిమా. ప్రముఖ నటుడు కైకల సత్యనారాయణ ఈ సినిమా నిర్మాత. ట్రెజర్ హంట్ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాను ఇప్పుడు 4K కు మార్చేసి DOLBY ATMOS సౌండ్ సిస్టమ్‌తో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను చిరంజీవి లాంచ్ చేశారు. దీంతో ఈ నవంబర్‌లో అక్కినేని, మెగాస్టార్ సినిమాలు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్