Wednesday, October 22, 2025 07:26 PM
Wednesday, October 22, 2025 07:26 PM
roots

పర్యటన తెచ్చిన తంటాలు..!

ఒక పర్యటన ఇప్పుడు సిక్కోలు జిల్లా నేతల మధ్య విభేదాలకు కారణమైంది. అసలు ఎందుకు వచ్చారో.. ఎప్పుడు వచ్చారో తెలుసుకునే లోపే పర్యటన పూర్తైంది. దీంతో కాగల కార్యం గంధర్వులు తీర్చారనేలా కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందంటూ ప్రచారం ప్రారంభమైంది. దీంతో పరిస్థితి పూర్తిగా చెయ్యి దాటిపోయింది. దీంతో పరిస్థితి చక్కదిద్దేందుకు అగ్రనేతలు రంగంలోకి దిగాల్సి వస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో కూటమి నేతల విభేదాలంటూ ఇప్పుడు జిల్లాలో పెద్ద దుమారం రేగుతోంది. ఇందుకు ప్రధాన కారణం జనసేన ఎమ్మెల్సీ నాగబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన కారణమనే మాట వినిపిస్తోంది. అసలు ఆయన ఎందుకు వచ్చారో తెలియదు.. ఎవరు పిలిచారో కూడా తెలియదు. కానీ కొంతమంది కూటమి నేతలు మాత్రం నాగబాబు పర్యటన పైన, కూటమి నేతల పైన విమర్శలు చేస్తున్నారు.

Also Read : వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

వారం రోజుల క్రితం జనసేన ఎమ్మెల్సీ నాగబాబు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. జిల్లాలో పలాస మొదలు.. ఎచ్చెర్ల వరకు నాగబాబు బిజీ బిజీగా తిరిగేశారు. అధికారులతో చర్చించారు. పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదేశాలు జారీ చేశారు. వెళ్లిపోయారు. అయితే ఈ పర్యటనపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు నాగబాబు పర్యటన గురించి కూటమిలోని టీడీపీ, బీజేపీ నేతలకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదనేది ప్రధాన ఆరోపణ. మా నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు.. మాకు చెప్పాలని తెలియదా అని టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు నిలదీస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నుంచి జనసేన ఎమ్మెల్యే, ఎచ్చెర్ల నుంచి బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగిలిన 8 నియోజకవర్గాల్లో టీడీపీ ప్రజాప్రతినిధులున్నారు. శ్రీకాకుళం, పలాస పట్టణాల్లో కూడా నాగబాబు పర్యటనపై ఆయా ఎమ్మెల్యేలకు తెలియజేయలేదు. శ్రీకాకుళం బస్టాండ్ దుస్థితి గురించి నాగబాబుకు జనసేన నేతలు ఫిర్యాదు చేయడంతో.. ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో.. అసలు మా నియోజకవర్గంలో మీ పెత్తనం ఏమిటనే మాట కూడా వినిపిస్తోంది.

Also Read : ఆ పదవులు ఎప్పుడు భర్తీ చేస్తారో..?

ఇక నాగబాబు పర్యటనపై సొంత పార్టీ నేతలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నేతలు, నియోజకవర్గం ఇంఛార్జ్‌లకు కూడా సమాచారం ఇవ్వటం లేదని జనసేన నేతలే విమర్శలు చేస్తున్నారు. జిల్లా స్థాయి జనసేన పార్టీ విస్తృత సమావేశానికి మంత్రి నాదెండ్ల మనోహర్, నాగబాబు హాజరయ్యారు. ఈ సమావేశం గురించి కనీస సమాచారం ఇవ్వాలేదని జనసేన పార్టీ సీనియర్ నేతలు కొందరు దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో జిల్లాలో జనసేన పార్టీ వ్యవహారాలు ఎవరు చూస్తున్నారో తమకు తెలియటం లేదనేది కొందరు పార్టీ నేతల మాట. పాలకొండ ఎమ్మెల్యే టీడీపీ నుంచి జనసేనలో చేరిన తర్వాత టికెట్ దక్కించుకున్నారు. ఆయన ఇప్పటికీ టీడీపీ నేతలతోనే ఎక్కువగా టచ్‌లో ఉన్నారనేది ప్రధాన ఆరోపణ. జిల్లా పార్టీ అధ్యక్షులు కనీసం తమను పట్టించుకోవటం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకే నాగబాబు పర్యటనకు దూరంగా ఉన్నామనేది కొందరు జనసేన పార్టీ నేతల ఆరోపణ. మొత్తానికి నాగబాబు సిక్కోలు జిల్లా పర్యటన కూటమి పార్టీల మధ్య పెద్ద దుమారానికి కారణమైంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

నా తండ్రికి ఆమె...

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రోజు...

బ్రేకింగ్: డీఎస్పీకి అండగా...

తెలుగు రాష్ట్రాల్లో జూదం, కోడి పందాలు...

ఎమ్మెల్యే బావమరిదిని కంట్రోల్...

రాజకీయ నాయకుల అవినీతి వ్యవహారాల విషయంలో...

జోగి రమేష్ సంగతేంటి..?...

ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం కేసు వెనకడుగు...

డీఎంకే నేతలతో కలిసి...

ఆంధ్రప్రదేశ్ కల్తీ మధ్య వ్యవహారానికి, తమిళనాడు...

శ్రీలేఖకు టీడీపీ క్యాడర్...

రాజకీయాల్లో ప్రభుత్వ అధికారుల పాత్ర కాస్త...

పోల్స్