Friday, October 24, 2025 07:39 AM
Friday, October 24, 2025 07:39 AM
roots

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో మరో సంచలనం

త్రివిక్రమ్ శ్రీనివాస్… టాలీవుడ్ లో ఈ దర్శకుడితో సినిమా చేయాలని దాదాపు స్టార్ హీరోలందరి కీ ఒక కల. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ సహా కొందరు హీరోలు ఆ కలను నెరవేర్చుకున్నారు. అటు మాస్ ని ఇటు క్లాస్ ని కూడా ఒకే విధంగా ఆకట్టుకునే త్రివిక్రమ్ తో సినిమా చేయడం అనేది కొంతమంది హీరోలు అదృష్టంగా కూడా భావించే పరిస్థితి టాలీవుడ్ లో ఉంది. త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి గాను ఎన్టీఆర్ లాంటి హీరో కూడా సినిమాలను వాయిదా వేసుకున్నాడు అంటే త్రివిక్రమ్ కు ఉన్న క్రేజ్ ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఒక సినిమా కోసం కథను సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు లేదా అల్లు అర్జున్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉందని టాలీవుడ్ లో గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది. ఎన్టీఆర్… ఆర్ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆ సినిమా ఆలస్యం అయితే నాని తో సినిమా చేసే అవకాశం ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు మహేష్ బాబు తో సినిమా చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సాధారణంగా మహేష్ బాబు ఒక సినిమా చూస్తుంటే ఆ సినిమా మీద ప్రత్యేక దృష్టి పెడతారు కానీ ఇప్పుడు పరుశురామ్ తో సర్కార్ వారి పాట సినిమా చేస్తున్న సరే… త్రివిక్రమ్ తో సినిమా చేసే అవకాశం ఉందని సమాచారం. ఎప్పటి నుంచో త్రివిక్రమ్ కోసం ట్రై చేస్తున్న మహేష్ బాబు… త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా కోసం బిజీగా ఉండటంతో పరుశురామ్ తో సినిమా ప్లాన్ చేసాడు. అయితే ఎన్టీఆర్ ఇప్పట్లో త్రివిక్రమ్ కు అందుబాటులో వచ్చే అవకాశం లేదు కాబట్టి మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమా చేసే విధంగా అడుగులు వేస్తున్నట్టు టాలీవుడ్ లో చర్ చజరుగుతోంది

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

కొలికపూడి వర్సెస్ కేసినేని.....

తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు...

త్వరలో మంత్రివర్గంలో భారీ...

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా...

బ్రేకింగ్: తుని ఘటనలో...

గత రెండు రోజుల నుంచి అత్యంత...

దానం చుట్టూ మరో...

దానం నాగేందర్.. తొలి నుంచి వివాదాలు...

నా తండ్రికి ఆమె...

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రోజు...

పోల్స్