Friday, October 24, 2025 01:19 PM
Friday, October 24, 2025 01:19 PM
roots

12th Fail: ఇక తెలుగులో ’12th ఫెయిల్’ చూసేయొచ్చు.. ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్

12th ఫెయిల్ సినిమా సృష్టించిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎస్ మనోజ్ కుమార్ రియల్ స్టోరీని అద్భుతంగా తెరకెక్కించారు విధు వినోద్ చోప్రా. విక్రాంత్ మస్సే- మేధా శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అటు బాక్సాఫీస్ దగ్గర తర్వాత ఓటీటీలో కూడా దుమ్మురేపింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ సినిమాకి వచ్చిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. ఇది మస్ట్ వాచ్ సినిమా అంటూ నెటిజన్లు అందరూ ఏక కంఠంతో ఈ సినిమాను ప్రమోట్ చేశారు. అయితే ఓటీటీలో మాత్రం ఇప్పటివరకూ కేవలం హిందీలోనే ఈ సినిమా అందుబాటులో ఉండేది. కానీ తాజాగా సౌత్ ఇండియన్ ఆడియన్స్‌కి గుడ్ న్యూస్ ఇచ్చింది హాట్ స్టార్.

తెలుగు సహా
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ చిత్రాన్ని డిసెంబర్ 29 నుంచి హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తుంది. అయితే నేటి నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ ఇన్‌స్పైరింగ్ స్టోరీ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా తెలుగువ ఆడియన్స్‌ ఈ సినిమాను తమ మాతృభాషలో చూసేందుకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికపై తరచుగా ఈ డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకి వారి కోరిక తీరింది. మరి సౌత్ ఇండియన్ భాషల్లో ఈ సినిమా ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.

జీ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించింది. ప్రియాంషు ఛటర్జీ, సంజయ్ బిష్ణోయ్, హరీష్ ఖన్నా వంచి నటులు కీలక పాత్రలు పోషించారు. శంతను మోయిత్రా ఆకట్టుకునే సంగీతాన్ని అందించారు.

ఇదీ కథబిహార్‌లోని ఓ గ్రామంలో నిజాయితీపరుడైన క్లర్క్ కొడుకు మనోజ్ కుమార్ 12th ఫెయిల్ అవుతాడు. అయినప్పటికీ ఎప్పటికైనా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనే కలతో దిల్లీలో పార్ట్ టైమ్ జాబులు చేస్తూ కష్టపడి ప్రిపేర్ అవుతాడు. స్వయంకృషితో, సొంత కోచింగ్‌తో మనోజ్ కుమార్ తన కలను నిజం చేసుకుంటాడు. అయితే ఆ జర్నీలో అతను పడిన కష్టాలు, జారిన కన్నీళ్లు, అనుభవించిన బాధ, సాధించిన విజయాలు ఇలా ప్రతీ దాన్ని చాలా అద్భుతంగా స్క్రీన్‌పై చూపించారు డైరెక్టర్. అందులోనూ ఇది ఐపీఎస్ మనోజ్ కుమార్ రియల్ స్టోరీ కావడంతో ఆడియన్స్‌కి ఇంకా బాగా కనెక్ట్ అయింది. సినిమా చూస్తున్నంత సేపు అందులో లీనమైపోయారు ప్రేక్షకులు. ముఖ్యంగా యూపీఎస్సీ సహా పలు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, యువత ఈ సినిమాను పదే పదే చూసి మోటివేట్ అవుతున్నారు.

 

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

కొలికపూడి శ్రీనివాస్ సస్పెన్షన్...

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు...

కంపెనీ ట్రిప్ కోసం...

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు...

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

కొలికపూడి వర్సెస్ కేసినేని.....

తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు...

త్వరలో మంత్రివర్గంలో భారీ...

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా...

బ్రేకింగ్: తుని ఘటనలో...

గత రెండు రోజుల నుంచి అత్యంత...

పోల్స్