Friday, October 24, 2025 09:47 AM
Friday, October 24, 2025 09:47 AM
roots

మాట నిలబెట్టుకున్న మెగాస్టార్.. విశ్వంభరలో విలన్‌గా ఆ యాక్టర్

పద్మవిభూషణ్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara) ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్ట్ చేస్తున్నాడు. 2025 సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాలో క్యాస్టింగ్ అదిరిపోతుందని డైరెక్టర్ వశిష్ట గతంలోనే చెప్పారు. దానికి తగ్గట్లే విశ్వంభర నుంచి రోజుకో అనౌన్స్‌మెంట్ వస్తుంది. తాజాగా విశ్వంభరలో విలన్ పాత్ర కోసం విలక్షణ నటుడు రావు రమేశ్‌ను సెలక్ట్ చేశారట. రావు రమేశ్ పాత్రే సినిమాలో మెయిన్ విలన్ అని టాక్.

చిరు కోరిక తీరింది
నిజానికి ఈ పాత్ర కోసం పలువురు బాలీవుడ్ స్టార్స్ కోసం మూవీ టీమ్ చూసిందట. కానీ ఆ పాత్రకి సరిపోయే వారు ఎవరూ దొరకకపోవడంతో రావు రమేశ్ కరెక్ట్‌గా సరిపోతారని ఫిక్స్ చేశారట. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే గతంలో రావు రమేశ్ గురించి చిరంజీవి మాట్లాడిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో తిరుగుతోంది.

ఓ ప్రి రిలీజ్ వేడుకలో రావు రమేశ్ గురించి చిరు మాట్లాడుతూ “రావు గోపాలరావుగారు లేని స్థానాన్ని భర్తి చేస్తూ, ఆయనకంటే ఎన్నో ఉన్నతమైన పాత్రలు వేస్తూ.. ఇంకా చిన్నవాడివి కాబట్టి ఇంకా అత్యున్నతమైన స్థానానికి వెళ్లాలని కోరుకుంటున్నాను.. అలానే నా కోరిక ఏంటంటే నాతో కూడా ఓ సినిమా చెయ్”అన్నారు. “అయినా నాతో ఎందుకు నువ్వు సినిమా చేయడం లేదు.. ఏమై ఉంటుంది” అంటూ సరదాగా ఆటపట్టించారు చిరు. ఇప్పుడు ఈ వీడియోను వైరల్ చేస్తూ మొత్తానికి చిరు అన్న మాటను, తన కోరికను ఇన్నాళ్లకి తీర్చుకున్నారు. రావు రమేశ్ తొలిసారిగా చిరంజీవి సినిమాలో నటిస్తున్నారంటూ పోస్టులు పెడుతున్నారు. రావు రమేశ్ తండ్రి రావు గోపాలరావుతో చిరు ఎన్నో సినిమాలు చేశారు. వీరి కాంబోలో వచ్చిన సీన్లు అన్నీ బంపర్ హిట్ అయ్యాయి.

స్టార్ క్యాస్టింగ్
ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిష నటిస్తుంది. అలానే యంగ్ బ్యూటీ సురభి (జెంటిల్‌మెన్ ఫేమ్) కూడా ఈ చిత్రంలో ఓ పాత్ర పోషిస్తుంది. అలానే ఈషా చావ్లా (ప్రేమకావాలి), రమ్య పసుపులేటి (హుషారు) కూడా విశ్వంభరలో ఛాన్స్ కొట్టేశారు. మరి ఈ చిత్రంలో ఇంకెవరికి అవకాశం వస్తుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే విశ్వంభర కోసం ఓ ప్రత్యేక సెట్‌లో ఫ్యామిలీ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అలానే చిత్రంలో చిరు క్యారెక్టర్ పేరు దొరబాబు అని తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

కొలికపూడి వర్సెస్ కేసినేని.....

తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు...

త్వరలో మంత్రివర్గంలో భారీ...

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా...

బ్రేకింగ్: తుని ఘటనలో...

గత రెండు రోజుల నుంచి అత్యంత...

దానం చుట్టూ మరో...

దానం నాగేందర్.. తొలి నుంచి వివాదాలు...

నా తండ్రికి ఆమె...

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రోజు...

పోల్స్