Sunday, October 26, 2025 07:13 AM
Sunday, October 26, 2025 07:13 AM
roots

మోక్షజ్ఞ ఎంట్రీ ఆ డైరెక్టర్ తోనే..? క్లారిటీ వచ్చేసిందా..?

టాలీవుడ్ లో నందమూరి ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఎంట్రీ.. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ. ఎప్పటినుంచో దీనిపై ప్రచారం జరుగుతున్న సరే ఇప్పటివరకు ఒక సినిమా కూడా పూర్తిగా సెట్స్ మీదకు వెళ్లలేదు. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడని అధికారికంగా ప్రకటించారు. సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. కానీ సినిమా మాత్రం ముందుకు వెళ్లలేదు. సినిమా ఆగిపోలేదని ప్రశాంత్ వర్మ చెప్పిన సరే.. ఫ్యాన్స్ కూడా నమ్మలేదు.

Also Read : ఎన్టీఆర్ విత్ నీల్.. మరో ఇద్దరు స్టార్ హీరోలు.. ?

బాలకృష్ణ చెప్పిన కండిషన్స్ విషయంలో ప్రశాంత్ వర్మ అభ్యంతరం చెప్పడంతోనే సినిమా ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. మరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉండవచ్చు అనేదానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. అయితే ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. జెర్సీ వంటి అద్భుతమైన సినిమాను ను తెరకెక్కించిన.. గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కనబడుతోంది. జెర్సీ సినిమా మాదిరిగానే ఓ అద్భుతమైన స్పోర్ట్స్ స్టోరీని మోక్షజ్ఞ కోసం రెడీ చేశాడట గౌతం. ఈ కథ బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని విని.. బాలయ్యకు కూడా రిఫర్ చేసినట్లు.. టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

Also Read : ఎక్కడన్నా..? వైసీపీ కార్యకర్తలకు దొరకని జగన్

వాస్తవానికి గౌతమ్.. కింగ్డమ్ సినిమా తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. కానీ ఆ స్టోరీ రామ్ చరణ్ కు సూట్ కాకపోవడం, పెద్ది సినిమాతో రామ్ చరణ్ బిజీగా ఉండటంతో మరో కథను మోక్షజ్ఞ కోసం రెడీ చేసి నందమూరి కాంపౌండ్ కు తీసుకువెళ్ళాడు గౌతం. ఇక అక్కడ నచ్చడం.. సినిమా కూడా కమర్షియల్ యాంగిల్ తో పాటుగా క్లాసిక్ యాంగిల్ ఉండటంతో తేజస్విని ఓకే చెప్పారట. అయితే బాలకృష్ణ కొన్ని మార్పులు చెప్పారని అందుకే సినిమా కాస్త ఆలస్యం అవుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే దసరా తర్వాత సినిమా సెట్స్ మీదకు వెళ్ళవచ్చు అంటున్నారు సినీ జనాలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

హైడ్రా కమీషనర్ రంగనాథ్...

హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం...

పోల్స్