Tuesday, October 28, 2025 01:39 AM
Tuesday, October 28, 2025 01:39 AM
roots

షమీ వెడ్స్ సానియా.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫొటోస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. హీరోయిన్లు హీరోలకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఎడిట్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు. అలాగే క్రికెటర్లకు సంబంధించిన ఫోటోలు కూడా ఈ మధ్య కాస్త హల్చల్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా టీమిండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమీతో మాజీ టెన్నీస్ స్టార్ సానియా మీర్జా ఒక బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు… వీళ్ళిద్దరూ కలిసి క్రిస్మస్ జరుపుకుంటున్నట్లు కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి.

Also Read : ఏపీలో మరో అధికారిపై ఏసీబీ కేసు నమోదు..!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎడిటింగ్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. ముందు అవి నిజమే అనుకున్నా… జనాలు ఆ తర్వాత అది ఏఐ టెక్నాలజీ అని క్లారిటీకి వచ్చారు. ఇక ఇదే టైంలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది అనే ఒక రూమర్ కూడా వైరల్ అవుతుంది. ప్రస్తుతం సానియా మీర్జా సింగిల్ గా ఉంటుంది. అటు మహమ్మద్ షమీ కూడా సింగిల్ గానే ఉంటున్నాడు. అయితే వీళ్ళిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని… ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్న ఈ ఇద్దరు డేటింగ్ కూడా చేస్తున్నారని కొన్ని వెబ్సైట్స్ కథనాలు రాయడం మొదలుపెట్టేసాయి.

Also Read : ఇంఛార్జుల మార్పు.. క్యాడర్‌లో అసంతృప్తి..!

భర్త నుంచి సానియా మీర్జా విడాకులు తీసుకున్న తర్వాత తన కొడుకుతో కలిసి హైదరాబాదులో ఉంటుంది. ఇప్పటికే ఆమె రెండో పెళ్లిపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసిన ఫోటోలతో జనాలకు కాస్త మైండ్ బ్లాక్ అయింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ రెండు నెలల నుంచి ఒక రూమర్ అయితే వచ్చింది. అయితే సానియా మీర్జా కంటే షమీ వయసులో చిన్నవాడు కావడం గమనార్హం. దీనిని గమనిస్తున్న కొంతమంది అది నిజమైనా ఆశ్చర్యం లేదంటూ కామెంట్ చేయడం విశేషం. సామాన్యులకు వయసుతో పనిగాని… ప్రముఖులకు వయసుతో పని ఏం ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్