Friday, October 24, 2025 11:50 AM
Friday, October 24, 2025 11:50 AM
roots

ఢిల్లీలో జగన్ కు గట్టి షాక్ ఇచ్చిన మోడీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పరిపాలనను టార్గెట్ చేసి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించిన సమయంలో జగన్ కు మోడీ మార్క్ షాక్ తగిలింది. తాజాగా బడ్జెట్ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ప్రత్యేకమైన ఫోకస్ ఉన్నట్టు నిర్మల సీతారామన్ చెప్పడంతో జగన్ ఏం చేసినా ఏపీలో ప్రభుత్వం పై ప్రజలలో వ్యతిరేకత రాదు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తాజాగా చెప్పిన శుభవార్త వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి షాక్ అనే చెప్పాలి. కేంద్ర బడ్జెట్ లో ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక సహాయం చేయనున్నట్టు ప్రకటించటం, ఏపీలో ప్రభుత్వ పాలన సక్సెస్ చేసేందుకు కేంద్రం తమ మద్దతు ఉంటుందని ప్రకటించడం జగన్ కు అసలు డైజెస్ట్ కాని విషయం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉందని పేర్కొంటూ ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి 15 వేల కోట్ల రూపాయలను ప్రకటించటంతో పాటు అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించటం ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జగన్ వేసిన ప్లాన్ ను నీరుగార్చటమేనని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేయటం .. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పటం చంద్రబాబుకు నిజంగా బూస్ట్ ఇచ్చిన అంశాలు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇస్తామని చెప్పడం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహకారం అందిస్తామని చెప్పడం ఏపీ ప్రభుత్వానికి గొప్ప వరాలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

కొలికపూడి వర్సెస్ కేసినేని.....

తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు...

త్వరలో మంత్రివర్గంలో భారీ...

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా...

బ్రేకింగ్: తుని ఘటనలో...

గత రెండు రోజుల నుంచి అత్యంత...

దానం చుట్టూ మరో...

దానం నాగేందర్.. తొలి నుంచి వివాదాలు...

నా తండ్రికి ఆమె...

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రోజు...

పోల్స్