Tuesday, October 28, 2025 01:36 AM
Tuesday, October 28, 2025 01:36 AM
roots

రాధ పరిస్థితి ఏంటీ..? చంద్రబాబు ఆలోచన ఏంటీ..?

ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది నేతలకు పదవులు ఎప్పుడు దూరంగానే ఉంటాయి. అందులో వంగవీటి రాధా ముందు వరుసలో ఉంటారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన ఆ తర్వాత మళ్లీ శాసనసభలో అడుగుపెట్టలేదు. ఈ క్రమంలోనే మూడు పార్టీలు మారిన వంగవీటి రాధ రాజకీయంగా ఏ అడుగులు వేస్తారనే దానిపై ఆయన అభిమానులతో పాటుగా కాపు సామాజిక వర్గానికి కూడా క్లారిటీ లేదు. కాపు సామాజిక వర్గంలో వంగవీటి రాధకు మంచి ఫాలోయింగ్ ఉంది.

Also Read : ఏపి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఏబీవీ పోస్టింగ్

ఆయన తండ్రి వంగవీటి రంగాను అభిమానించే వారందరూ రాధ మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే రాధ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి పదవులను చేపట్టలేదు. అయితే తెలుగుదేశం పార్టీ రాధకు కచ్చితంగా కీలక పదవి అప్పగించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. 2019 ఎన్నికల తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని, మంత్రి పదవి ఇస్తారని చాలా వార్తలు షికారు చేసాయి. కానీ ఇప్పటివరకు ఆయనకు ఏ పదవి ఇస్తారనే దానిపై క్లారిటీ రావట్లేదు.

Also Read : కండలు కరగకుండా బరువు తగ్గాలంటే.. ఇవి ఫాలో అవ్వండి..!

ఇక ఎమ్మెల్సీ పదవులు విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆలోచన ఎలా ఉందనే దానిపై క్లారిటీ లేదు. ఏపీలో వైసీపీ సభ్యులు రాజీనామాలు చేయడంతో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. దీనితో ఒక స్థానానికి వంగవీటి రాధను ఖరారు చేసే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్ స్వయంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కానీ రాధకు మాత్రం ఇప్పటివరకు ఏ పదవిని అధిష్టానం ఖరారు చేయలేదు.

Also Read : నా ట్విట్టర్ నేను వాడలేదు.. షర్మిల ముందు విజయసాయి సంచలన విషయాలు…!

అటు రాధ కూడా పదవులు విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే అభిప్రాయం రంగా అభిమానుల్లో వ్యక్తం అవుతుంది. అయితే మార్చి లేదా ఏప్రిల్ లో వంగవీటి రాధా శాసనమండలిలో అడుగు పెట్టడం ఖాయమనే ప్రచారం స్టార్ట్ అయింది. అయితే మంత్రి పదవి రాకపోయినా ఆయనకు శాసనమండలిలో గౌరవ స్థానం కల్పించే దిశగా టిడిపి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్