Sunday, October 19, 2025 03:56 AM
Sunday, October 19, 2025 03:56 AM
roots

తెలంగాణలో ఆగని మంత్రుల వార్

తెలంగాణ రాజకీయాల్లో మంత్రుల వ్యవహారాలు రోజురోజుకీ రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి. ఒక సమస్యను పరిష్కరిస్తే మరో సమస్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చికాకులు తెస్తున్నాయి. కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ నిత్యం ఏదో ఒక వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు. తన శాఖపై వివేక వెంకటస్వామి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని మొన్నామధ్య.. కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Also Read : ట్రంప్ ఆశలన్నీ గల్లంతు.. అయ్యో పాపం..!

ఆ తర్వాత ఈ వ్యవహారాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం చల్లబరిచింది. ఇక నాలుగు రోజుల క్రితం మంత్రులు పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరీ లక్ష్మణ్ గా వివాదం మొదలైంది. తనను దున్నపోతు అన్నారంటూ లక్ష్మణ్.. పొన్నం ప్రభాకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చక్కబెట్టారు. ఇక ఇప్పుడు కొండా సురేఖ వర్సెస్ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిగా వాతావరణం మారింది. మేడారం జాతరకు సంబంధించి టెండర్లలో.. పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని, సమీక్ష సమావేశాలు జరుపుతున్నారని ఆమె ఆగ్రహ వ్యక్తం చేశారు.

Also Read : విజయ్ కు ఎన్డీయే ఆఫర్లు ఇవే..?

పదేపదే తన శాఖలో ఆయన జోక్యం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కొండ సురేఖ. అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన సరే లాభం లేకుండా పోయిందని.. ఆమె మండిపడుతున్నారు. ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని ఆమె భావిస్తున్నారు. రేపు కొండా సురేఖ ఢిల్లీ వెళ్తున్నట్లు ఆమె కార్యాలయ వర్గాలు తెలిపాయి. గతంలో కూడా ఆమె శాఖలో పలువురు మంత్రులు జోక్యం చేసుకోవడాన్ని కొండా సురేఖ జీర్ణించుకోలేకపోతున్నారు. అవసరమైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, తన శాఖలో ఇద్దరు మంత్రులు జోక్యం చేసుకునేలాగా అయితే తనకు మంత్రి పదవి వద్దని.. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడికి.. సమాచారం ఇచ్చారట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

ఎన్నాళ్ళీ వర్క్ ఫ్రమ్...

రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు ఎంత బలంగా...

పోల్స్