Friday, September 12, 2025 02:59 PM
Friday, September 12, 2025 02:59 PM
roots

తమ్ముడు తమ్ముడే.. పదవి పదవే.. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య పదవి చిచ్చు

డబ్బుకి రాజకీయాలకు దగ్గర సంబంధం ఉంటుంది. కుటుంబ సంబంధాల విషయంలో డబ్బు ఏ విధంగా దెబ్బ కొడుతుందో రాజకీయాలు కూడా అదే విధంగా దెబ్బకొడతాయి. డబ్బు కోసం కుటుంబంలో చీలిక ఏ విధంగా వస్తుందో రాజకీయాల్లో పదవుల కోసం కూడా అదే స్థాయిలో వస్తుంది. ఇప్పుడు ఓ మంత్రి పదవి ఇద్దరు అన్నదమ్ముల మధ్య చీలిక తీసుకువచ్చినట్లుగానే కనబడుతోంది. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకులగా గుర్తింపు ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య పదవి చిచ్చు రగులుతోంది.

Also Read : పులివెందుల టీడీపీదే.. వైసీపీకి దక్కని డిపాజిట్ 

2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కీలక శాఖలు అప్పగించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముందు తనను వ్యతిరేకించిన వెంకటరెడ్డి తర్వాత సహకరించడంతో ఆ రుణం తీర్చుకున్నారు రేవంత్ రెడ్డి. నల్గొండ జిల్లాలో ప్రభావం చూపించే రెడ్డి సామాజిక వర్గాన్ని తన వైపుకు తిప్పడంలో కోమటిరెడ్డి సక్సెస్ కావడంతో మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. అధిష్టానం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. ఇదే సమయంలో మునుగోడు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి అడుగుతూ వచ్చారు. భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిస్తే తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పిందన్న అంశాన్ని పదేపదే రాజగోపాల్ రెడ్డి గుర్తు చేస్తూ వస్తున్నారు.

దాదాపు రెండు నెలల క్రితం జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కుతుందని రాజగోపాల్ రెడ్డి ఎదురు చూశారు. అనూహ్యంగా ఆయన పేరు పరిశీలనలో కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దీనికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాదన మరోలా ఉంది. ఒకే కుటుంబంలో రెండు మంత్రి పదవులు ఎలా ఇస్తారని, అది సాధ్యం కాదని రాష్ట్ర నాయకత్వం అంటుంది. తనకు మంత్రి పదవి హామీ ఇచ్చినప్పుడు ఆ విషయం గుర్తులేదా అంటూ రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇలా అయితే పని జరగదని కాంగ్రెస్ పార్టీ కీలక నేత డీకే శివకుమార్ తో ప్రయత్నాలు కూడా మొదలుపెట్టి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బహిరంగ విమర్శలకు దిగారు.

Also Read : మోడీ రాజీనామా చేయాల్సిందే..? పట్టుబడుతున్న ఆర్ఎస్ఎస్..?

ఇక ఇప్పుడు రెండున్నర ఏళ్ల పంచాయతీ కోమటిరెడ్డి కుటుంబంలో నడుస్తోంది. తనకు మంత్రి పదవి రావాలి అంటే వెంకటరెడ్డి రాజీనామా చేయాలని రాజగోపాల్ రెడ్డి కోరుతున్నట్లు సమాచారం. దీనికి వెంకటరెడ్డి ససేమేరా అంటున్నారు. తమ్ముడు తమ్ముడే పదవి పదవే అంటూ.. రాజీనామా చేసేది లేదని స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కూడా రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు రాజగోపాల్ రెడ్డి కాస్త ప్రయత్నిస్తున్నట్టు సైతం ప్రచారం జరుగుతుంది. ఈ ప్రయత్నాలను వెంకటరెడ్డి అడ్డుకుంటున్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఏది ఎలా ఉన్నా ఈ మంత్రి పదవి విషయం మాత్రం కాంగ్రెస్ పార్టీలో కంటే కోమటిరెడ్డి కుటుంబంలో ఎక్కువ సమస్యగా మారే సంకేతాలే కనపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్