Friday, September 12, 2025 03:01 PM
Friday, September 12, 2025 03:01 PM
roots

నారాయణ గారు.. ఏమిటా దూకుడు..!

నారాయణ గారు.. ఏమిటా దూకుడు.. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట. ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. విద్యా వేత్త, నిదానస్తుడు అనే పేరున్న వ్యక్తి. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఆయన చేయలేదు. తనపైన ఎన్ని ఆరోపణలు వచ్చిన సరే.. సైలెంట్‌గా ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. దీని వల్ల మంత్రి నారాయణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి కూడా మంత్రిగా నారాయణకు అవకాశం దక్కింది. అది కూడా గతంలో ఆయన నిర్వహించిన మునిసిపల్ శాఖనే అప్పగించారు చంద్రబాబు. నిజానికి ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా కూడా 2014లో నారాయణను మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. కీలకమైన మునిసిపల్ శాఖను అప్పగించారు. రాజధాని అమరావతి నిర్మాణ బాధ్యతను నారాయణకు అప్పగించారు. అయితే దీనిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నారాయణపై వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అయితే ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నా కూడా ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేదు నాటి జగన్ సర్కార్.

Also Read : శ్రీ సిటీ కీలక ఒప్పందం… ఇక ఆ గ్యాస్ ఇక్కడి నుంచే..!

ఇక కూటమి సర్కార్ గెలిచిన తర్వాత గంటా శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పితాని సత్యనారాయణ వంటి సీనియర్ నేతలను కాదని మరోసారి నారాయణను మంత్రిగా చేశారు చంద్రబాబు. రెండోసారి కూడా రాజధాని నిర్మాణ బాధ్యతలను నారాయణకే అప్పగించారు. అయితే దీనిపైన అప్పుట్లోనే పెద్ద ఎత్తున పార్టీ నేతలు కామెంట్లు కూడా చేశారు. గతంలో ఐదేళ్ల పాటు మంత్రిగా పని చేసిన నారాయణ హయాంలో కనీసం రాజధాని పరిధిలో ఒక్క భవనం కూడా పూర్తి చేయలేదు. దీంతో ఆయన పని తీరుపై అప్పట్లోనే నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక 2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత నారాయణ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఎక్కడా కనిపించలేదు. పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఆయన విద్యా సంస్థలపైనే దృష్టి పెట్టారు. అయితే టీడీపీకి ఆర్థికంగా అండదండలు అందించిన నారాయణపై పేపర్ లీకేజ్ ఆరోపణలతో జగన్ సర్కార్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో నారాయణను హైదరాబాద్‌లో అరెస్టు చేసి చిత్తూరు జిల్లా కోర్టులో హాజరుపరిచారు కూడా. అయితే ఇదంతా తనపై జరుగుతున్న కుట్ర అని నారాయణ కొట్టి పారేశారు.

Also Read : ఎన్టీఆర్ పై బాలీవుడ్ జనాల కుళ్ళు.. ఆల్ఫా మేల్ కాదంటూ కామెంట్

2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణకు కూడా మరో అవకాశం ఇచ్చారు. అయితే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నారాయణ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. రాజధాని అమరావతి మొదటి దశ నిర్మాణాన్ని 2027 నాటికి పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందుకు తగినట్లుగా నిధులు కూడా విడుదల చేస్తున్నారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి నారాయణ.. నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే తొలి నుంచి మంత్రి నారాయణ తీరుపై అధికారులు గుర్రుగా ఉన్నారు. మంత్రి నారాయణ..సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంది. సమన్వయ లోపం కారణంగా.. ఈ ఇద్దరి వ్యవహారం సీఎంఓకు చేరింది. మంత్రి తీరుతో సీఆర్‌డీఏలో కార్యక్రమాలు సజావుగా సాగటం లేదని కమిషనర్ స్వయంగా సీఎంకు ఫిర్యాదు చేశారు. కొన్ని టెండర్ల వ్యవహారంలో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని.. ఇద్దరూ ఎదురుపడినా కూడా మాట్లాడుకోని పరిస్థితి ఏర్పడిందని అధికారులు వెల్లడించారు.

Also Read : జనాభా పెరుగుదలపై చంద్రబాబు ఫోకస్.. సంచలన నిర్ణయాల దిశగా సర్కార్..!

ఇక మంత్రి నారాయణ వ్యవహార శైలితో ఆ శాఖలో వివిధ హోదాల్లో పని చేస్తున్న ఐఏఎస్ అధికారులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఎంత తొందరగా ఆ శాఖ నుంచి బయటకు పోదామా అని ఎదురు చూస్తున్నారు. మూడేళ్లల్లో రాజధాని మొదటి దశ పూర్తి చేయాలనే లక్ష్యం.. మరో మూడేళ్లకు పూర్తి అయ్యేలా లేదు అనేది అధికారుల మాట. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇప్పటికీ చెట్లు పూర్తిగా తొలగించలేదు. 90 శాతం పైగా పూర్తి అయిన భవనాలు 2019లో ఎలా ఉన్నాయో.. ఇప్పడూ అలాగే ఉన్నాయి. రెండు రోజుల క్రితం ఐఏఎస్, ఐపీఎస్, ఉద్యోగులకు సంబంధించిన క్వార్టర్లను పరిశీలించిన మంత్రి నారాయణ.. అక్కడే ఉన్న అధికారిపై నోరు పారేసుకున్నారు. ప్రభుత్వానికి ప్రస్తుతం ప్రకృతి సహకరించడం లేదు. పది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయి. ఈ విషయం గుర్తించాల్సిన మంత్రి నారాయణ.. పనుల పూర్తికి మరో నెల రోజులు అవుతుందన్న ఇంజినీర్‌పై కేకలేశారు. యూజ్ లెస్ ఫెలో .. గెటౌట్‌.. గెటౌట్‌..” అంటూ విరుచుకుప‌డ్డారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఉన్నత విద్యావంతుడు, విద్యా సంస్థల అధినేత, మంత్రి నారాయణ అధికారులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్