Friday, September 12, 2025 02:31 PM
Friday, September 12, 2025 02:31 PM
roots

మెడికల్ కాలేజీల వార్.. అసలు నిజాలేమిటో..?

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి చేరుకుంది. కేంద్రం మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణను పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం.. పీపీపీ కింద ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. కొత్త మెడికల్ కాలేజీల్లో 10 కాలేజీలను పీపీపీ ద్వారా అభివృద్ధి చేయాలని మంత్రివర్గంలో తీర్మానం చేసింది కూటమి ప్రభుత్వం. ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. తొలి విడతలో ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల కాలేజీలను పీపీపీకి ఇవ్వనున్నారు.

Also Read : వైసీపీకీ టీడీపీ భరోసా..!

అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం కష్టపడి మెడికల్ కాలేజీలు నిర్మిస్తే.. వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందని ఆరోపించారు. అదే సమయంలో మెడికల్ కాలేజీల కోసం ఎవరైనా సరే టెండర్లు వేస్తే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టెండర్లు రద్దు చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. మెడికల్ కాలేజీ నిర్మాణం అంటే.. ఏడాదిలో, రెండేళ్లల్లో పూర్తి కాదన్నారు కూడా.

జగన్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ఘాటుగానే బదులిస్తున్నారు. తాను కట్టిన మెడికల్ కాలేజీల దగ్గరకు వెళితే అంతా వావ్ అనాలన్నారు. దీనిపై టీడీపీ నేతలు ఇప్పుడు కొన్ని ఫోటోలు విడుదల చేస్తున్నారు. పునాదుల దశలో ఉన్న కాలేజీ భవనాల ఎదుట నిలబడి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. భవనాలు పునాదుల దశ కూడా దాటలేదని రుజువులు చేస్తున్నారు. అలాగే మరో ఆరోపణ కూడా చేస్తున్నారు.

Also Read : ఇదేం ప్రెస్ మీట్ అన్న..? షాక్ అవుతున్న జర్నలిస్ట్ లు

ఓ మెడికల్ కాలేజీ కట్టడానికి కనీసం మూడేళ్లు పైగా సమయం పడుతుందన్న జగన్.. రుషికొండ ప్యాలెస్ మాత్రం..2023లో మొదలుపెట్టి 2024 ఎన్నికల నాటికి ఏడాదిన్నరలోనే పూర్తి చేశారంటున్నారు. కానీ 2021లో మొదలుపెట్టిన కాలేజీలు మాత్రం కనీసం పునాదుల దశ కూడా దాటలేదంటున్నారు. నాలుగేళ్లల్లో ఎందుకు కట్టలేకపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

పోల్స్