Tuesday, October 28, 2025 08:11 AM
Tuesday, October 28, 2025 08:11 AM
roots

ఇంగ్లాండ్ కు అయినా యువ బౌలర్ వస్తాడా…?

భారత్ లో ఏ సీరీస్ జరిగినా… బౌలింగ్ విషయంలో టీమిండియా కు పెద్దగా ఇబ్బందు ఉండదు. ఆసియా పర్యటనల్లో ఎక్కడైనా సరే సత్తా చాటుతుంది. బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల పర్యటనకు వెళ్ళినప్పుడు స్పిన్ బౌలింగ్ తో నెట్టుకు వచ్చేస్తుంది. అలాగే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన సమయంలో కూడా స్పిన్ బౌలింగ్ తో పెద్దగా భారత్ కు కష్టాలు తెలియడం లేదు. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు మాత్రం మన బౌలింగ్ లోపాలు పెద్ద ఎత్తున బయటపడుతున్నాయి.

Also Read : అధ్యక్ష అంటావా.. ఇంట్లో ఉంటావా..?

ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ లో భారత్ విఫలమవుతోంది. అయితే ఇప్పుడు యువ బౌలర్లను తీసుకురావాలి అనేది అభిమానుల నుంచి ప్రధానంగా వినపడుతున్న డిమాండ్. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. దాదాపు సగం పూర్తయిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఇప్పటికే సెమీఫైనల్ కు చేరుకుంది. ఈ టోర్నీ కంప్లీట్ అయిన తర్వాత ఐపీఎల్లో ఆటగాళ్లు పాల్గొంటారు. అనంతరం ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ మొదలవుతుంది. ఆ సీరిస్ కు బౌలింగ్ విభాగం ఎంత పటిష్టంగా ఉంటుందనేది చెప్పలేని పరిస్థితి.

Also Read : కారు స్టీరింగ్ పట్టుకునేది ఎవరు..?

ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా పైనే ఆస్ట్రేలియాలో టీమిండియా ఆధారపడింది. ఇతర బౌలర్ల నుంచి అతనికి ఏమాత్రం సహకారం లేదని చెప్పాలి. అయితే ఇంగ్లాండ్ పర్యటనకు మహమ్మద్ షమీ అందుబాటులో ఉండే అవకాశం ఉండటంతో జట్టుకు ఇబ్బందులు లేవు అనే అభిప్రాయం వినపడుతోంది. వీళ్ళిద్దరితోపాటు మరో కీలక బౌలర్ కూడా ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయాలు గట్టిగా వినపడుతున్నాయి. ఇంగ్లాండ్ మైదానాలు స్వింగ్ బౌలింగ్ కు బాగా అనుకూలంగా ఉంటాయి.

Also Read : కోహ్లీ కంటిన్యూ చేస్తాడా..?

కాబట్టి ఖచ్చితంగా స్వింగ్ తో పాటు వేగం ఉన్న ఆటగాడు అయితే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో 23 ఏళ్ల మయాంక్ యాదవ్ ను జట్టులోకి తీసుకురావాలని.. అతన్ని సాన పెట్టాలని ముందుగానే అతని ఇంగ్లాండ్ పంపించి అక్కడ కౌంటింగ్ మ్యాచ్ లలో ఆడించాలని అభిమానులు కోరుతున్నారు. అతని వేగంతో పాటుగా స్వింగ్ కూడా బాగుంటుంది. ఇది కచ్చితంగా భారత్ కు కలిసి వచ్చే అవకాశం. కాబట్టి దీనిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు అభిమానులు. ఇక మరో కీలక బౌలర్ హర్షిత్ రానాను కి కూడా ఇంగ్లాండ్ పర్యటనకు పంపిస్తే మంచిది అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్