Friday, September 12, 2025 07:11 PM
Friday, September 12, 2025 07:11 PM
roots

ప్రభాస్ పై మలయాళం స్టార్ హీరో సెన్సేషనల్ కామెంట్స్

బాహుబలి సినిమా తర్వాత నేషనల్ వైడ్ గా ప్రభాస్ ఇమేజ్ భారీగా పెరిగింది. దీనితో ప్రభాస్ సినిమా ఏది వచ్చిన సరే ఇండియా వైడ్ గా క్రేజ్ ఉంటుంది. ఇక సలార్ సినిమా తర్వాత మళ్లీ హిట్ ట్రాక్ లోకి అడుగుపెట్టిన ప్రభాస్ భారీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. దాదాపు 8 సినిమాలను ప్రభాస్ లైన్లో పెట్టాడు. ఇందులో కన్నడ అగ్రనిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లోనే దాదాపుగా మూడు సినిమాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభాస్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. ఇక ప్రభాస్ తో సలార్ లో కలిసి యాక్ట్ చేసిన మలయాళం స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Also Read : పవన్ డేట్స్ ఇస్తారా..? డైరెక్టర్ లో రిలీజ్ టెన్షన్స్

అంత పెద్ద స్టార్ అయినప్పటికీ ప్రభాస్ చాలా సింపుల్ గా ఉంటాడని, స్టార్ డమ్ గురించి అసలు ఆలోచించడు అన్నాడు. సోషల్ మీడియాపై ఇంట్రెస్ట్ ఉండదని ప్రభాస్ పేరుతో ఉన్న… ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి వచ్చే పోస్ట్ లు షేర్ చేసేది కూడా ఆయన కాదన్నాడు. ఈ మాట చెప్పి మీ అందరినీ నిరాశ పరిచినందుకు క్షమించాలంటూ రిక్వెస్ట్ చేశాడు. అతడికి చిన్న చిన్న ఆనందాలు అంటే చాలా ఇష్టం అని అన్నాడు. ఫామ్ హౌస్ లో చాలా సంతోషంగా ఉంటాడని, ఎక్కడైనా మొబైల్ పనిచేయని ప్రాంతానికి వెళ్దాం అని ఎప్పుడూ అడుగుతూ ఉంటాడన్నాడు.

Also Read : జనంలోకి జనసేన.. ఫ్యూచర్‌ ప్లాన్ అదే..!

అంత పెద్ద స్టార్ ఇలాంటి చిన్న ఆనందాలను కోరుకోవడం చూసి ఒక్కోసారి తాను షాక్ అవుతానంటూ కామెంట్ చేశాడు. ఇక రాజమౌళి పై కూడా పృధ్విరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. బాహుబలి తర్వాతే హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీయడం మొదలైందని, బాహుబలికి ముందు కొన్ని సినిమాల సీక్వెల్స్ వచ్చినప్పటికీ బాహుబలి సీక్వెల్ రేంజ్ లో రికార్డు స్థాయిలో విజయం సాధించడంలో ఫెయిల్ అయ్యాయని కామెంట్ చేశాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్