జై జగన్ అనకుంటే గొంతు కోస్తాం అంటూ అప్పట్లో మాచర్లలో జరిగిన ఓ దారుణం.. ఇప్పటికీ ఓ సంచలనమే. రాజకీయంగా ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ప్రాణాలు కోల్పోయిన చంద్రయ్య మృతదేహాన్ని… అప్పట్లో చంద్రబాబు నాయుడు పాడే కూడా మోశారు. జాతీయ స్థాయిలో ఈ దారుణం సంచలనం అయిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలో ఉండటంతో ఈ కేసు ముందుకు వెళ్ళలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కేసు ముందుకు వెళ్లకపోవడంపై ఆగ్రహం వ్యక్తమైంది.
Also Read : ఇలా అయితే కష్టమే.. బాబు మాస్ వార్నింగ్..!
తాజాగా దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాచర్ల చంద్రయ్య కేసు ను సీఐడీ కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే ఫైల్ పంపాలని ఆదేశాలు జారీ చేసింది. కేసును రీ ఓపెన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2022 జనవరి 13 న మాచర్ల నియోజకవర్గం లో చంద్రయ్య ఘటన జరిగింది. ఈ ఘటనలో వైసీపీ నేతలే బాధ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జనవరి 13 న పట్టపగలు చంద్రయ్య గొంతు కోసి దారుణానికి పాల్పడ్డారు.
Also Read : సినిమాల్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే.. స్టోరీ లైన్ కూడా చెప్పేశారు…!
ఘటనకు ముందు ముందు జై జగన్ అనమని వైసీపీ నేతలు బెదిరించినా… చంద్రయ్య మాత్రం వెనక్కు తగ్గలేదు. అంతకుముందు మాచర్ల ఇంచార్జిగా నియమించిన జూలకంటి బ్రహ్మ రెడ్డి ర్యాలీ కి చంద్రయ్య వెళ్లి వచ్చారు. ఆ తర్వాత వైసీపీ నాయకులు చంద్రయ్యను టార్గెట్ చేసి.. తుది ముట్టించారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు చంద్రయ్య మృతదేహానికి నివాళులు అర్పించి చంద్రయ్య అంత్యక్రియలలో పాల్గొనగా దీనికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.