ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు సిద్ధం కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యకాలంలో తరచుగా ఢిల్లీ వెళ్తున్న లోకేష్.. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసిన సంగతి తెలిసిందే. నరేంద్ర మోడీ అమరావతి పర్యటనకు వచ్చిన సమయంలో ఢిల్లీ పర్యటన ఆహ్వానించారు. దీనితో కుటుంబ సభ్యులతో కలిసి లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read : హాట్ టాపిక్‌గా బన్నీ యాటిట్యూడ్
ఇప్పుడు మరోసారి లోకేష్ ఢిల్లీ పర్యటనకు సిద్ధం కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనగా మారింది. లోకేష్ ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి వైసీపీలో ఆందోళన కనబడుతుందనే కామెంట్స్ కూడా వింటూనే ఉన్నాం. లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో విచారణ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో లోకేష్ ఢిల్లీ పర్యటన ఆసక్తిని కలిగిస్తుంది. లోకేష్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత కీలక అరెస్టులు ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దానితోపాటుగా మరికొన్ని కేసులను కూడా బయటకు లాగే అవకాశం ఉండొచ్చనే ప్రచారం సైతం జరుగుతుంది.
Also Read : వైసీపీలో ఊపు వస్తుందా.. సాధ్యమేనా..?
అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలుస్తారా లేదా అనే దానిపై క్లారిటీ లేకపోయినా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉండొచ్చని రాజకీయ వర్గాలు ఉంటున్నాయి. దానితో పాటుగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కూడా లోకేష్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. లోకేష్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఒక కీలక వ్యక్తిని అరెస్టు చేసే అవకాశం ఉండొచ్చని మీడియాలో ప్రచారం జరుగుతోంది. లిక్కర్ కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. తాజాగా ఓ కానిస్టేబుల్ రాసిన లేఖ సంచలనం అయింది. అతడిని దర్యాప్తు అధికారులు ఇటీవల విచారించిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లాకు చెందిన సదరు నాయకుడిని అరెస్టు చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.




