Sunday, March 22, 2026 03:55 PM
Sunday, March 22, 2026 03:55 PM

విభేదాల్లో కూడా సంస్కారమే.. ఓ మెట్టు ఎక్కిన లోకేష్..!

సోషల్ మీడియా అందుబాటులో వచ్చిన తర్వాత ఎవరికి తోచిన వీడియోలు వాళ్లు పెడుతున్నారు. ఇక AI అందుబాటులోకి వచ్చిన తర్వాత అయితే మరీ రెచ్చిపోతున్నారు. రాజకీయ పార్టీల అభిమానులు, కార్యకర్తలు అయితే.. ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారు కూడా. తమ అభిమాన నేత గొప్పల కోసం ప్రత్యర్థులను కించపరిచేలా ఫోటోలు, వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఇది వ్యక్తిత్వ హననానికి కూడా దారి తీస్తోంది.

Also Read : తిత్తి తీస్తాం.. పవన్ సంచలన కామెంట్స్

ఏపీలో వైసీపీ ఓటమికి సోషల్ మీడియాలో మహిళలపైన జగన్ అభిమానులు పెట్టిన బూతు పోస్టులు కూడా ఒక కారణం. చంద్రబాబు కుటుంబ సభ్యుల పైన, పవన్ కల్యాణ్ పిల్లల పై కూడా విచక్షణా రహితంగా పోస్టులు పెట్టారు. బోరుగడ్డ అనిల్ వంటి రౌడీ షీటర్లు అయితే.. బూతులతో రెచ్చిపోయారు కూడా. ఇది ఆ పార్టీ పైన చెడు ప్రభావానికి ఒక కారణమైంది. అందుకే వైసీకీ కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయని రాజకీయ విశ్లేషకులు అప్పట్లోనే చెప్పేశారు. అందుకే జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు.

తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ నడుచుకుంటూ పోతుంటే.. రోడ్డు పక్కనే నేల మీద కూర్చున్న జగన్.. తనకు ప్రతిపక్ష హోదా కావాలంటూ ప్లకార్డు పట్టుకున్నారు. వాళ్లు అలాగే వెళ్లిపోతుంటే.. జగన్ కూడా వాళ్ల వెంట పడుతున్నట్లుగా AI వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై ఇప్పటికే భిన్నమైన కామెంట్లు వచ్చాయి.

అయితే ఈ వీడియోను పోస్టు చేసిన లోకేష్.. సొంత పార్టీ అభిమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నా ప్రియమైన టీడీపీ కుటుంబ సభ్యులారా.. ఇటువంటి కంటెంట్ వెనుకున్న భావోద్వేగాన్ని నేను అర్థం చేసుకున్నాను. అయితే వ్యక్తిగత దాడులు ఎప్పుడూ మంచివి కావు. మనం రాజకీయ ప్రత్యర్థులమై ఉండొచ్చు, కానీ మన ప్రజా సంభాషణ గౌరవం, మర్యాదలపై ఆధారపడాలి. మా అనుచరులు సహా అందరూ ఇలాంటి కంటెంట్‌ను ప్రచారం చేయకుండా ఉండాలని నేను కోరుతున్నాను. విభేదాల్లోనూ సంస్కారాన్ని పాటిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను బలోపేతం చేసే నిర్మాణాత్మక రాజకీయాలపై దృష్టి పెడుదాం” అని ట్వీట్‌లో మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

Also Read : ఎన్డియే వ్యూహంతో బిజెపిని మమత దెబ్బ కొడతారా..?

లోకేష్ పోస్టుకు అన్ని పార్టీల నేతలు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇలా ప్రతి నేత తమ కార్యకర్తలకు చెబితే.. సోషల్ మీడియాలో బూతులే ఉండవంటున్నారు. పార్టీల అభిమానం ముసుగులో ఇతరులను కించపరిచేలా కామెంట్ చేయడం సరికాదన్నారు. ప్రతి పార్టీ సోషల్ మీడియా కూడా AI వీడియోలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్