నేపాల్ లో వాతావరణం మరింత తీవ్ర రూపం దాల్చింది. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడంతో ప్రారంభమైన ఉద్యమం.. అటు ఇటు తిరిగి రాజకీయ నాయకులపై గురి పెట్టింది. రాజధాని కాట్మండు లో ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్ చేస్తూ యువత భారీగా హింసకు దిగారు. పార్లమెంటు, సుప్రీంకోర్టు, అధ్యక్షుడు, ప్రధాని నివాసాలకు నిప్పు పెట్టారు. మంత్రులపై దాడులకు కూడా దిగారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో సైన్యం రంగంలోకి దిగింది. ప్రధాని కేపీ శర్మ ఓలి సహా మంత్రులు రాజీనామా చేయాలని.. ఆర్మీ సూచించింది.
Also Read : ఓజీ కోసం.. చీఫ్ గెస్ట్ లు వీళ్ళే..!
ఇక నేపాల్ పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడి భారతీయుల కోసం అత్యవసర కాంటాక్ట్ నెంబర్లను ఏర్పాటు చేసి తక్షణ చర్యలకు దిగింది. అత్యవసర పరిస్థితి ఎదురైతే భారత ఎంబసీ లోని నెంబర్లను సంప్రదించాలని పేర్కొంది. అలాగే భారతీయులు ఎవరు నేపాల్ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది. ఇక ఇటు నేపాల్ పరిస్థితిల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలుగువారి కొరకు రంగంలోకి దిగింది. దీనికోసం మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు చేసుకున్నారు.
Also Read : ఈవీఎంలా..? బ్యాలెట్టా..? చంద్రబాబు సర్కార్ ముందు గోల్డెన్ చాన్స్
నేపాల్ లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారినే సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేదానిపై లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారు. 10 గంటలకు సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ కు లోకేష్ చేరుకుని అధికారులతో సమీక్ష జరుపుతున్నారు. రియల్ టైం గవర్నెన్స్ వేదికగా ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసి సంబంధిత మంత్రులు, శాఖల అధికారులతో సమన్వయం చేయనున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే ఆర్టిజిఎస్ సెంటర్ కు రావాలని లోకేష్ ఆదేశించారు. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ సెంటర్ ఏర్పాటుచేసి, పరిస్థితిని సమీక్షించనున్నారు. నేపాల్ లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో తక్షణమే వారిని రాష్ట్రానికి తీసుకొచ్చే దిశగా చర్యలు చేపట్టనున్నారు.




