Tuesday, October 21, 2025 10:57 AM
Tuesday, October 21, 2025 10:57 AM
roots

చాగంటిపై లోకేష్ ప్రసంశలు.. ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి నారా లోకేష్ ప్రసంగం ఆకట్టుకుంది. విద్యా శాఖపై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. విద్యాశాఖ బలోపేతం గురించి లోకేష్ ప్రసంగించారు. కూటమి ప్రభుత్వంలో 9,600 ప్రాథమిక పాఠశాలల్లో తరగతికో ఉపాధ్యాయుడు ఉన్నాడని, ఏ రాష్ట్రంలో కూడా ఇంత సంఖ్య లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ను లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేసారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గురించి లోకేష్ మాట్లాడారు.

Also Read : బ్రేకింగ్; సేవకులకు టీటీడీ గుడ్ న్యూస్..!

చాగంటి కోటేశ్వరరావు గారిని అభినందిస్తున్నానని, ప్రభుత్వం నుంచి చాగంటి కోటేశ్వరరావు గారు ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదన్నారు. నేను ఆశ్చర్యపోయానన్న లోకేష్.. కనీసం ప్రభుత్వం నుంచి ఫోన్ కూడా తీసుకోలేదని కొనియాడారు. వాటర్ బాటిల్ కూడా తీసుకోవడం లేదని, అద్భుతమైన పుస్తకాలను రూపొందించారని అభినందించారు. ఆయన రూపొందించిన పుస్తకాలను ప్రింట్ చేసి విద్యార్థులకు అందిజేస్తున్నామన్నారు. ఫీజుల నియంత్రణపై కూడా లోకేష్ మాట్లాడారు.

Also Read : కేసీఆర్ ప్లాన్ అమలు చేయనున్న జగన్..!

ప్రైవేటు కార్పోరేట్ పాఠశాలలను ఫీజు నియంత్రణ కమిటీ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందా అని మండలిలో కుడిపూడి సూర్యనారాయణ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఏపీఎస్ఈఆర్ఎంసి చట్టాన్ని 2019లో తీసుకురావడం జరిగిందని, ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ క్లాస్ వన్ టీచర్ ను ప్రైమరీ స్కూళ్లలో అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 117 జీవో వల్ల కేవలం 1200 పాఠశాలల్లో వన్ క్లాస్ వన్ టీచర్ ఉంటే.. కూటమి ప్రభుత్వంలో సుమారు 9,600 ప్రాథమిక పాఠశాలల్లో వన్ క్లాస్ వన్ టీచర్ ను అందజేశామన్నారు. ఇందుకు తగ్గట్లుగా ఉపాధ్యాయులను మోటివేట్ చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

కందుకూరులో వైసీపీ ప్లాన్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సామాజిక వర్గాల మధ్య...

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

పోల్స్